నాగార్జున చేస్తోంది కరెక్టేనా..?

Divya
నాగార్జున ప్రస్తుతం యువ హీరోలకు పోటీగా ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తూ తన దూకుడును కొనసాగిస్తున్నాడు. ఇటీవల నాగచైతన్యతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించగా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా బ్రహ్మాస్త్ర ఈ సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తెలుగులో మాత్రం ఘోస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఫిజికల్ డైరెక్టర్ గరుడవేగ తీసిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కించబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

ప్రస్తుతం ఘోస్ట్  సినిమా నుంచి షూటింగ్ దుబాయ్ లో జరుగుతున్నది. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్నది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక ఎడారి లో యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ  వయసు లో కూడా నాగార్జున డూప్ లేకుండా ఈ సినిమా చేయడం అంటే ఒక ఛాలెంజ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం సూపర్ సీనియర్ హీరోలంతా ఎక్కువగా పాపులర్ డైరెక్షన్లోనే యాక్షన్ సినిమాలను చేస్తూ ఉన్నారు. కానీ నాగార్జున మాత్రం యువ దర్శకులకు ఛాన్స్ ఇస్తే డిఫరెంట్ కథలతో దూసుకుపోతున్నారు.

నాగార్జున ఇప్పటివరకు ఎన్నో దశాబ్దాల సినిమా ప్రయాణంలో విభిన్నమైన కథల తో నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ఉన్నారు. ఇక ట్రెండుకు తగ్గట్టుగానే నాగార్జున నిలుస్తూ ఉన్నారు. ఇండస్ట్రీకి ఎంతోమందిని సరికొత్త వాళ్ళని పరిచయం చేస్తూ ఉన్నాడు నాగార్జున. ఇక నాగార్జున ఎన్నో పరాజయాలు ఎదుర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే. అయినప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా దూసుకుపోతున్నారు. ఏది ఏమైనా నాగార్జున ఇప్పుడు సోలోగా బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఘోస్ట్ ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంటారు అని అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ముఖేష్ జి అందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: