సూపర్ స్టార్
కృష్ణ ఫ్యామిలీ నుంచి హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు
సుధీర్ బాబు. కెరీర్ స్టార్టింగ్ నుంచీ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకోడానికి తెగ కృషి చేస్తున్నారు.విభిన్నమైన కథలతో పాటు విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ వస్తున్నారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలను
సుధీర్ బాబు లైన్ లో పెడుతున్నారు.ఇప్పుడు
సుధీర్ బాబు చేతిలో ఉన్న సినిమాలలో "ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి"సినిమా ఒకటి.
krishna INDRAGANTI' target='_blank' title='ఇంద్రగంటి మోహనకృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యంగ్
బ్యూటీ కృతి శెట్టి
హీరోయిన్ గా నటిస్తోంది.
అవసరాల శ్రీనివాస్ -
వెన్నెల కిషోర్ -
రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు.ఇప్పటికే ఈ
సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్,టీజర్ ఇంకా సాంగ్స్ కి మంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అదే సమయంలో 'సమ్మోహనం'
సినిమా తరహా కాన్సెప్ట్ తోనే 'ఆ అమ్మాయి..'
సినిమా రూపొందుతోందనే సందేహాలు కూడా కలిగించింది.
నాలుగేళ్ల క్రితం
సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబినేషన్ లో వచ్చిన 'సమ్మోహనం'
సినిమా మంచి విజయం సాధించింది.అందులో 'సినిమా నేపథ్యం' తీసుకున్నాడు
డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ. 'ఆ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి' టీజర్ ని బట్టి ఈ సినిమాలోనూ అదే బ్యాక్ డ్రాప్ ని తీసుకొని ఓ
బ్యూటిఫుల్ లవ్ స్టొరీ చెప్పబోతున్నాడని చూస్తుంటే తెలుస్తుంది.
హీరో సుధీర్ బాబు ఫిలిం
డైరెక్టర్ గా ఇంకా అలాగే కృతి శెట్టి అప్ కమింగ్
హీరోయిన్ గా నటిస్తున్నారు.అయితే అప్పుడు హిట్ అయిందని అదే కాన్సెప్ట్ తో మళ్ళీ ఇప్పుడు
సినిమా చేస్తే వర్కౌట్ అవుతుందా అని ఫిల్మ్
నగర్ లో కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. పైగా
సుధీర్ బాబు స్టార్
హీరో స్టేటస్ కోసం ఎప్పటినుంచో ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాడు.మరి
సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్
సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.