మహేష్ సినిమాలో ఆ విషయం గురించి క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా అజయ్ దేవ్ గన్,  సముద్ర ఖని  ప్రధాన పాత్రలో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే,  ఈ సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఎంతో భారీ స్థాయిలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి మరియు ఇతర సినిమా సభ్యులు ప్రమోషన్ లో భాగంగా ప్రస్తుతం అనేక ఇంటర్వ్యూలను ఇస్తూ అలాగే అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు,  ఇది ఇలా ఉంటే దర్శక ధీరుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'  సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమాను తెరకెక్కించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  


అయితే మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో బాలకృష్ణ కూడా నటించబోతున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  అయితే రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలకు తాజాగా రాజమౌళి చెక్ పెట్టేసాడు,  ఆర్ఆర్ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బెంగళూరు వెళ్లిన రాజమౌళికి, లోకల్ మీడియా నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.  దానికి రాజమౌళి స్పందిస్తూ...  ఈ మూవీ లో బాలకృష్ణ చేయనున్నారనే వార్తల్లో నిజం లేదు,  మహేశ్ బాబు తప్ప మరో హీరో ఈ మూవీ లో ఉండరు .. ఇది మల్టీ స్టారర్ కాదు అని అని రాజమౌళి స్పష్టం చేశారు.  ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ లో హీరోగా నటిస్తున్నాడు, పరశు రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: