ఈసారి మాత్రం ఆ ముద్దు గుమ్మకే అవకాశం ఇవ్వబోతున్న సుకుమార్..?

Pulgam Srinivas
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రష్మిక మందన హీరోయిన్ గా ఫాహాద్ ఫాసిల్  విలన్ గా, సునీల్ , అనసూయ , రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే, పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన పుష్ప ఇండియా వైట్ గా కలెక్షన్ లను కూడా భారీగా రాబట్టింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా అదనపు ఆకర్షణగా నిలిచింది, ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో సమంత చేసిన స్పెషల్ సాంగ్ 'ఊ అంటావా మామ .. ఉ ఉ అంటావా మావా'  ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో మనందరికీ తెలిసిందే,  ఇది ఇలా  ఉంటే ఈ మాస్ మసాలా సాంగ్ కోసం మొదట దిశా పటానీ ని అనుకున్నారు,  కానీ చివరి నిమిషం లో పుష్ప పార్ట్ వన్ లో  స్పెషల్ సాంగ్ లో సమంత వచ్చి చేరింది.  


సమంత పుష్ప పార్ట్ వన్ సినిమాలో చేసిన  'ఊ అంటావా మామ .. ఉ ఉ అంటావా మావా'  సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు,  ఇది ఇలా ఉంటే ఇక  ఇప్పుడు పుష్ప టు లోను ఒక హాట్ హాట్ ఐటమ్ ను సుకుమార్ ,  దేవి శ్రీ ప్రసాద్ ప్లాన్ చేశారట.  ఈ సారి మాత్రం పుష్ప పార్ట్ టు లో దిశా పటాని కే ఛాన్స్ ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట,  ఈ మూవీ సెకండ్ పార్టు లో ఈ మాస్ బీట్ యూత్ ను ,  మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేయడం ఖాయమని అంటున్నారు,  ఇది ఇలా ఉంటే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో లోఫర్ సినిమాలో తన అందచందాలతో ఎంతో మంది ప్రేక్షకులను ఫిదా చేసిన దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: