సినిమా ఇండస్ట్రీ చిరంజీవికి రుణపడిందన్న రాజమౌళి!
అలాంటి సమయంలో చిరంజీవి.. ముఖ్యమంత్రి గారితో వున్న తనకు ఉన్న సాన్నిహిత్యంతో రెండు మూడు సార్లు వైయస్ జగన్ గారిని కలిసి టిక్కెట్ రెట్లు పెంచడానికి కారణం అయ్యారని గుర్తు చేసుకున్నారు. చిరంజీవిగారిని ఈ విషయంలోఎందరో ఎన్నో మాటలు అన్నారని.. కానీ ఇండస్ట్రీ కోసం.. మా కోసం.. మమ్మలని నెగ్గించడం కోసం అయన తగ్గి ఆ మాటలు పడ్డారని రాజమౌళి అన్నారు. అందుకే చిరంజీవి గారు నిజమైన మెగాస్టార్ అన్న రాజమౌళి.. తెలంగాణలో కూడా ముందు జీవో రావడానికి కూడా చిరంజీవి గారే కారణమని.. ఆయన తెర వెనుక అయన వుండి టిక్కెట్ రెట్లు పెంచే జీవో తెప్పించారని అన్నారు.
చిరంజీవికి ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవాలని ఉండదని.. ఇండస్ట్రీ బిడ్డ అనిపించుకోవడం ఆయనకు ఇష్టం అన్నారు రాజమౌళి.. తాను మాత్రం చిరంజీవి గారిని ఇండస్ట్రీ పెద్దగానే గౌరవిస్తానని.. అందుకే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా చిరంజీవి గారికి రుణ పడి వుండాలని రాజమౌళి అన్నారు. ఇదే వేదికపై రాజమౌళి తెలుగు రాష్ట్రాల సీఎంలకు థ్యాంక్స్ చెప్పారు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పారు. ఏపీ సీఎం జగన్ గారికి కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి.. సినిమా టిక్కెట్ రేట్లు పెంచాలని అడిగితే.. రేట్లు మరీ పెంచకుండా అలాగే పేదవారికి భారం కాకుండా బ్యాలెన్స్ గా రెట్లు ఇచ్చారని.. ఇందుకు సహకరించిన మంత్రులు పేర్ని నాని, కొడాలి నానికి కూడా థ్యాంక్స్ అన్నారు రాజమౌళి.