ఆర్ ఆర్ ఆర్ లెక్కలతో టాప్ హీరోలకు తిప్పలు !

Seetha Sailaja
ఆంధ్రప్రదేశ్ లో భారీ సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంపుదల విషయమై ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి అంటే ఆసినిమాకు ఖర్చు అయిన బడ్జెట్ వివరాలు ప్రభుత్వానికి తెలపడం తప్పనిసరి కావడంతో ‘ఆర్ ఆర్ ఆర్’ నిర్మాతలు తమ ఖర్చులను ప్రభుత్వానికి తెలిపి టిక్కెట్ రేటు పెంపుదల విషయమై అనుమతులు తీసుకున్నారు.

వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ బడ్జెట్ ఎంత ఖర్చు అయింది అన్న విషయమై చాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇండస్ట్రీలోని కొందరు ఈమూవీకి 300 కోట్లు మించి అవ్వదు అని చెపుతుంటే మరికొందరు ఈమూవీకి 450 కోట్లు అయినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఈసినిమాకు పెట్టిన పెట్టుబడి పై వడ్డీల భారం కూడ చాల పడింది అన్న గుసగుసలు కూడ ఉన్నాయి.

ఏదోవిధంగా ఈమూవీ బడ్జెట్ తయారుచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు సంపాదించారు. ఇలా ఇదే సమ్మర్ రేస్ కు రాబోతున్న ‘ఆచార్య’ ‘సర్కారు వారి పాట’ ‘ఎఫ్ 3’ సినిమాల విషయంలో అదేవిధంగా ‘కేజీ ఎఫ్ 2’ డబ్బింగ్ సినిమా విషయంలో లెక్కలు ప్రభుత్వానికి చెప్పడం కష్టం అన్నమాటలు వినిపిస్తున్నాయి. ఈసినిమాలు అన్నింటికీ టిక్కెట్ల రేట్ల పెంపుదల విషయంలో అనుమతులు రాకపోవచ్చు అన్నసందేహాలు ఇండస్ట్రీ వర్గాలకు కల్గుతున్నాయి.

దీనితో భవిష్యత్ లో ప్రతి సినిమాను భారీ సినిమా అని లెక్కకట్టి ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం కష్టం అని చాలామంది అభిప్రాయం. ఇలాంటి పరిస్థితులలో సినిమాకు 50 కోట్లు పారితోషికం తీసుకుని హీరోలు దర్శకుల పారితోషికాలు సినిమా బడ్జెట్ లో కలవకపోతే ఇక రానున్న రోజులలో భారీ సినిమాలను తీసే సాహసం ఎవరు చేయరని ఒకవిధంగా ఇది టాప్ హీరోల సినిమాలకు శాపంగా మారే ఆస్కారం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం టాప్ హీరోలు తమ పారితోషికాలు భారీ స్థాయిలో పెంచడంతో తమ సినిమాలకు అయ్యే బిజినెస్ లో వాటా తీసుకుంటున్నారు. అలా లెక్కలు వేస్తే టాప్ హీరోల సినిమాలు అన్నీ 100 కోట్ల లోపు సినిమాలుగా మారే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: