ఆ రెండు రాష్ట్రాలలో మొదలైన RRR టికెట్స్ బుకింగ్..!!

Divya
గత రెండు సంవత్సరాలుగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్న హిస్టారికల్ డ్రామా మూవీ rrr సినిమా మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందు సందడి చేయబోతోంది. దాదాపుగా ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి గ్లింప్, పాటలు, ట్రైలర్, టీజర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకులను బాగా అలరించడమే కాకుండా సినిమా పై మరింత హైప్ ను క్రియేట్ చేశాయి. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కూడా సుమారుగా ఆరు నెలల నుండి ఈ చిత్రం యూనిట్ మొదలుపెట్టి బారికేడ్లను ఏర్పాటు చేసి వివిధ రాష్ట్రాలలో, మహానగరాలలో సినిమా ప్రమోషన్స్ చేపట్టారు చిత్ర యూనిట్.


ఈ క్రమంలోనే హైదరాబాద్,  చెన్నై, మద్రాస్ అంటూ ఇలా రకరకాల ప్రదేశాలలో సినిమా ప్రమోషన్స్ చేపట్టి ప్రేక్షకుల్లో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేయడం గమనార్హం. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమా కోసం ముఖ్యంగా ఆలియాభట్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి తెలుగులో నటించబోతుందన్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకని మరి నటిస్తుండడంతో ఈమె పాత్ర పై  ప్రతి ఒక్కరి అంచనాలు పెరుగుతున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా విడుదల అవుతుంది కాబట్టి అందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో బుక్ మై షో ద్వారా టికెట్లు బుకింగ్ మొదలవగా మిగతా రాష్ట్రాల ప్రేక్షకులు కూడా ఎప్పుడు మొదలు పెడతారు అని ఆత్రుతగా ఎదురు చూశారు. ఇకపోతే ఈ రోజు నుంచి తమిళనాడు అలాగే ముంబై వంటి మహానగరాలలో ఈ సినిమాకు సంబంధించి టికెట్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించడం జరిగింది. ఇక ఈ సినిమా టికెట్స్ బుకింగ్ చూస్తూ ఉంటే కేవలం మొదటి రోజే రూ.50 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశాలున్నట్లు చిత్రం యూనిట్ అంచనా వేస్తోంది. ఏది ఏమైనా కలెక్షన్ల పరంగా తొలి ఇండియన్ ఫిలిం గా రికార్డు సృష్టించబోతోంది ఈ సినిమా అంటూ ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: