యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ర్ఆర్ సినిమాలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే, దర్శకధీరుడు
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ
మూవీ లో
ఎన్టీఆర్ తో పాటు
రామ్ చరణ్ కూడా మరో హీరోగా నటించాడు. అరవింద సమేత
సినిమా తర్వాత
ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమాలో నటించాడు, ఆర్ఆర్ఆర్
సినిమా ఈనెల 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇలా ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రస్తుతం
ఎన్టీఆర్ తో సహా చిత్ర బృందం లోని కొంత మంది సభ్యులు ప్రమోషన్ లో భాగంగా పలు
టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో పాల్గొంటున్నారు, అలాగే ఈ సినిమాకు సంబంధించిన
ఈవెంట్ లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా తర్వాత
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే
మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే, ఇది ఇలా ఉంటే ఇప్పటికే
ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్
సినిమా తెరకెక్కి
బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ రెండవ సినిమాలో
అలియా భట్ హీరోయిన్ గా దాదాపు ఖరారు అయ్యింది, ఇది ఇలా ఉంటే
ఎన్టీఆర్ , కొరటాల శివ
సినిమా తర్వాత ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న బుచ్చిబాబు
సనా దర్శకత్వంలో ఒక
సినిమా చేయబోతున్నట్లు సమాచారం, మైత్రి
మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ సినిమాను బుచ్చిబాబు సన స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లో
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ను
హీరోయిన్ గా చిత్ర బృందం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది, దీనితో
ఎన్టీఆర్ ఇద్దరు
బాలీవుడ్ హీరోయిన్ లతో నటించబోతున్నట్లు తెలుస్తుంది.