అందాల ముద్దుగుమ్మ కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లోకి
పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన
మూవీ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ తన మొదటి
సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ ను కూడా
టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది, ఈ
సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస క్రేజీ
సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. అందులో భాగంగా ఇప్పటికే కృతి శెట్టి నటించిన బంగార్రాజు,
శ్యామ్ సింగరాయ్ సినిమాలు మంచి విజయాలను
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయి, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ
మాచర్ల నియోజకవర్గం, ఈ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది
వారియర్ మూవీ లలో
హీరోయిన్ గా నటిస్తోంది.
ఇలా ఇప్పటికే మూడు సినిమాల విజయాలతో
బాక్స్ ఆఫీస్ దగ్గర హైట్రిక్ విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది, ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కు
ప్రభాస్ తో నటించే అవకాశం వచ్చింది అంటూ కూడా గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కృతి శెట్టి కి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది, అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కృతి శెట్టి కి మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో కేవలం రెండేళ్ల లో ఆరు సినిమాలకు కమిట్ అయిన ఈ
బ్యూటీ కి ఇప్పుడు ఏకంగా బీటౌన్ నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది, బాలీవుడ్ స్టార్
హీరో షాహిద్ కపూర్
హీరో గా తెరకెక్కుతోన్న
మూవీ లో కృతి శెట్టి ని హీరోయిన్గా తీసుకునేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది, ఈ
బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్ కి కృతి శెట్టి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.