ఆర్ ఆర్ ఆర్ ఈవెంట్స్ లో పార్టీ జెండాల హడావిడి !
ఎప్పటి నుండో తెలుగుదేశంలోని కొన్ని వర్గాలు జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాలలోకి రమ్మని ప్రత్యక్షంగా పరోక్షంగా ఆహ్వానిస్తూనే ఉన్నారు. అయితే జూనియర్ మాత్రం ఆ పిలుపుకు స్పందించకుండా రాజకీయాల గురించి ఆలోచించడానికి ఇంకా చాల సమయం ఉంది అంటూ చాల తెలివిగా తప్పించుకుంటున్నాడు.
అయితే లేటెస్ట్ గా జరుగుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రమోషన్ ఫంక్షన్స్ లో కొందరు తెలుగుదేశం జెండాలలో జూనియర్ ఫోటోను పెట్టుకుని ‘ఆర్ ఆర్ ఆర్’ ఫంక్షన్ లో హడావిడి చేసినట్లుగా వస్తున్న వార్తలు హాట్ టాపిక్ గా మారింది. దీనితో రామ్ చరణ్ అభిమానులు కూడ ‘జనసేన’ జెండాలలో రామ్ చరణ్ ఫోటోను పెట్టుకుని సందడి చేస్తూ జూనియర్ అభిమానులకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఈసంఘటన ఏఊరులో జరిగిందో క్లారిటీ లేకపోయినా సినిమా ఫంక్షన్స్ లో పార్టీల జెండాల హడావిడి ఏమిటి అంటూ కొందరు ఆశ్చర్యపోతున్నారు. టాప్ హీరోలుగా తారక్ చరణ్ లకు ఇంకా చాల భవిష్యత్ ఉంది. కనీసం మరో 10 సంవత్సరాలు వీరిద్దరూ ఈటాప్ హీరోల రేంజ్ లో కొనసాగుతారు. దీనితో వీరు ఇప్పట్లో రాజకీయాలలోకి వచ్చే ఆస్కారం లేదు.
అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ మనవడిగా జూనియర్ కు ఆపార్టీ వారసత్వం ఎప్పుడు ఉంటుంది. ఇక చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ‘జనసేన’ నడుస్తోంది కాబట్టి ఆపార్టీ క్యాడర్ కూడ చరణ్ రాజకీయాలలోకి రావాలని కోరుకోవడం సహజం. కానీ జనం సినిమా సెలెబ్రెటీ లను రాజకీయాలలో అంగీకరించడం లేదు అన్నది వాస్తవం. ఈవిషయాన్ని గుర్తించకుండా చరణ్ జూనియర్ అభిమానులు చేస్తున్న హడావిడి వారి విపరీతమైన అభిమానాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సినిమాలలో హీరోలు రాజకీయ డైలాగ్స్ చెపితే చప్పట్లు కొడుతున్నారు కానీ నిజంగా వారు రాజకీయాలలోకి వస్తే ఓట్లు వేయడం లేదు అన్న విషయం చరణ్ జూనియర్ లకు బాగా అర్థమైన విషయం..