సలార్ పై మారుతున్న ఆలోచనలు !

Seetha Sailaja

‘రాథే శ్యామ్’ పరాజయం చెందడంతో నిరాశకులోనైన అభిమానులు ‘సలార్’ పై ఆశలు పెట్టుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈమూవీ కంటే ముందు ‘ఆదిపురుష్’ రాబోతోంది. అయితే ‘ఆదిపురుష్’ ఫలితం పై కూడ ప్రభాస్ అభిమానులకు సందేహాలు ఉండటంతో ఆమూవీ కంటే ముందుగా ‘సలార్’ విడుదల కావాలని కోరుకుంటున్నారు.


అయితే ఆకోరిక తీరే అవకాశంలేదు అన్న సూచనలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు ఈ మూవీ షూటింగ్ ఇంకా 50శాతం మిగిలి ఉందని అందువల్ల ఈమూవీ ప్రభాస్ అభిమానులు కోరుకుని విధంగా ఈ సంవత్సరం చివరకు విడుదల అయ్యే ఆస్కారం లేదు అంటున్నారు. దీనికితోడు ఈ మూవీని కూడ రెండు పార్ట్ లుగా తీయాలి అన్నఆలోచనలు ప్రశాంత్ నీల్ కు వస్తున్న నేపధ్యంలో ఈమూవీ షూటింగ్ చాల నెమ్మదిగా జరుగుతోంది అన్నసంకేతాలు వస్తున్నాయి.


ఈవిషయమై ప్రభాస్ కు ప్రశాంత్ నీల్ కు చిన్నపాటి భేదాభిరాయాలు ఉన్నాయని ఈమూవీ రెండు పార్ట్ లుగా తీయడం ప్రభాస్ కు ఏమాత్రం ఇష్టం లేదు అని టాక్. అయితే లేటెస్ట్ గా విడుదలైన ‘పుష్ప’ రెండు పార్ట్ లుగా తీస్తున్న పరిస్థితులలో అదే పద్ధతి అనుసరించాలని ప్రశాంత్ నీల్ ప్రభాస్ పై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులు ప్రభాస్ ను యాక్షన్ స్టార్ గా చూడాలని కోరుకుంటున్నారు.


అయితే ప్రభాస్ మాత్రం లవ్ స్టోరీలు పురాణ కథలు చేసుకుంటూ తన కెరియర్ పై తానే ప్రయోగాలు చేసుకుంటున్నాడు. ఇలాంటి ప్రయోగాలు అభిమానులను తీవ్రంగా భయపెడుతున్నాయి. ‘రాథే శ్యామ్’ అనుభవాలను పక్కకు పెట్టి ప్రభాస్ మారుతి దర్శకత్వంలో ఒక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో నటిస్తాడు అని వస్తున్న వార్తలు అభిమానులను మరింత గందరగోళానికి గురి చేస్తున్నాయి. ప్రభాస్ మాత్రం ఈవిషయాలను పట్టించు కోకుండా ‘సలార్’ ను ఎందుకు వెనక్కు పెడుతున్నాడు అంటూ అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నట్లు టాక్. ప్రభాస్ అభిమానుల పట్టించుకోకుండా తన ప్రయోగాలను కొనసాగిస్తూనే ఉన్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: