న్యూమరాలజీ పై శ్రీకాంత్ కొడుకు రోషన్ నమ్మకాలు !
రోషన్ నాగార్జున తో కలిసి నటించిన ‘నిర్మలా కాన్వెంట్’ ఫెయిల్ అవ్వడంతో కొన్ని సంవత్సరాలు గ్యాప్ తీసుకుని అతడిని ఎందరో హీరోలకు బ్రేక్ ఇచ్చిన రాఘవేంద్రరావు చేతిలో పెట్టి ‘పెళ్ళి సందD’ మూవీని తీసారు. 25 సంవత్సరాల క్రితం విడుదలైన ‘పెళ్ళిసందడి’ లో శ్రీకాంత్ నటిస్తే క్రితం సంవత్సరం విడుదలైన రోషన్ ‘పెళ్ళి సందD’అతడి కెరియర్ కు మంచి బ్రేక్ ఇస్తుందని భావించారు అయితే అలా జరగలేదు.
ఆమూవీలో హీరోయిన్ గా నటించిన శ్రీలీల కు విపరీతంగా బుకింగ్స్ వస్తున్నాయి కానీ హీరో రోషన్ వైపు ఎవరి దృష్టి పడటంలేదు. దీనితో షాక్ కు గురైన శ్రీకాంత్ తన కొడుకు పేరులో న్యూమరాలజీ ప్రకారం మార్పులు చేసి “Roshann” గా మార్చి అదనంగా మరొక ‘N’ చేర్చారు. గతంలో తమన్నా కూడ ఇలాగే తన కెరియర్ బాగాలేనప్పుడు తన పేరులో మరొక లెటర్ ను చేర్చుకుని టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.
సాయి ధరమ్ తేజ్ కూడ గతంలో వరస ఫ్లాప్ లు వస్తున్నప్పుడు తన సాయి తేజ్ గా మార్చుకుని మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. బుల్లితెర పై రకరకాల గేమ్ షోలు డాన్స్ షోలు నిర్వహించే ఓంకార్ కూడా తన పేరులో మరొక అక్షరాన్ని అదనంగా జేర్చుకుని ఇప్పుడు బుల్లితెర పై తన హవా కొనసాగిస్తున్నాడు. వీరిందరినీ చూసి ప్రభావితమై తన పేరులో మార్పులు చేసుకున్న రోషన్ కు రానున్న కాలం కలిసివస్తే శ్రీకాంత్ వారసత్వాన్ని కొనసాగించే ఆస్కారం ఉంది..