ప్రముఖ నిర్మాత చేతిలో మోసపోయిన యువతి.. పవన్ ముందుకు పంచాయితీ?

VAMSI
గత కొంత కాలంగా సినిమా ఇండస్ట్రీని కాస్టింగ్ కౌచ్ వివాదం ఎంతలా ఇబ్బంది పెడుతోందో తెలిసిందే. ఇప్పుడు అలాంటి ఒక సంఘటన ఇండీస్ట్రీలో జరిగింది. నాకు న్యాయం చేయండి పవన్ సార్ అంటూ ఓ యువతి అభ్యర్ధన అందరి మనసులను కదిలించింది. నిర్మాత వాసు బన్నీ నన్ను మోసం చేశారంటూ, నాకు న్యాయం చేయండి అంటూ ఆందోళన చెందింది. పూర్తి వివరాల్లోకి వెళ్ళగా, ఆ మహిళ పేరు బోయ సునీత నిర్మాత వాసు బన్నీ తనను పెళ్లిచేసుకుంటా అని నమ్మబలికి మోసం చేశారు అంటూ న్యాయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి మంగళగిరి జనసేన ఆఫీస్ కు వచ్చింది సునీత.

అయితే అక్కడి సిబ్బంది ఆమెను లోపలికి అనుమతించక పోవడంతో  కార్యాలయం బయటే కూర్చుని తన గోడును వినాలని తనకు పవన్ సార్ సహాయం చేయాలని నిరసన మొదలు పెట్టింది ఆ మహిళ. నిర్మాత అయినటువంటి వాసు బన్నీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజయం కొరకు పనిచేయాలని తనకు కొన్ని పనులను అప్పగించారని ...వాసు చెప్పినట్లే చేసానని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గీతా ఆర్ట్స్ లో సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తాను అంటూ, తనని ప్రేమిస్తున్నాను అంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి బన్నీ వాసు తనను లైంగికంగా వాడుకున్నాడని సునీత ఆరోపణలు చేశారు.

తాను జనసేన పార్టీకోసం పని చేశాను కాబట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు తన బాధను చెప్పి న్యాయం చేయమని అడగాలని వస్తే తనని అడ్డుకుంటున్నారు అంటూ విలపిస్తోంది. ఈ విషయం గురించి జనసేన అధ్యక్షుడు పవన్ కు  సమాచారం అందినట్లు తెలుస్తుండగా ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ బన్నీ వాసు పంచాయితీ పవన్ వద్దకు చేరింది. అసలు ఏమి జరిగింది? దీనిపై బన్నీ వాసు ఎలా స్పందిస్తాడు అన్నది తెలియాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: