దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు ఏ మూవీ చేసినా కూడా జనాలు ఎగబడి చూస్తారు. ఆయనకి స్టార్ హీరోలతో పనిలేదు అనడం మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళ ఇమేజ్ కు రాజమౌళి ఇమేజ్ యాడ్ అయితే ఔట్పుట్ పీక్స్ లో ఉంటుంది అనడం అనేదే కరెక్ట్.
రాజమౌళి వల్ల స్టార్లు అయిన హీరోలతోనే ఇప్పటివరకు రాజమౌళి పనిచేస్తూ వచ్చాడట. కానీ ఆల్రెడీ స్టార్ ఫాలోయింగ్ ఉన్నవాళ్ళతో ఆయన సినిమాలు చేసింది అయితే లేదు. సరే ఇప్పుడంటే రాజమౌళితో సినిమా చేయడానికి ఏ హీరో అయినా రెడీగా ఉంటాడు కానీ ఒకప్పుడు రాజమౌళికి ఛాన్స్ లు ఇచ్చినవాళ్ళు ఎవరు? బాలకృష్ణకి కథ చెబితే సినిమా ఛాన్స్ ఇవ్వలేదని స్వయంగా బాలయ్యే ఒప్పుకున్నాడట. ఆయన వద్దకి వెళ్ళి రెండు, మూడు కథలు వెళ్లి చెప్పినా రాజమౌళికి ఛాన్స్ ఇవ్వలేదు. అయితే రాజమౌళి తీసిన మొదటి సినిమా తర్వాత ఆయన ఇమేజ్ మారిందా? అంటే కచ్చితంగా అవునని మాత్రం చెప్పలేము. ఎందుకంటే 'స్టూడెంట్ నెం1' మూవీ హిట్ అయినా కూడా దాని క్రెడిట్ మొత్తం కూడా రాఘవేంద్ర రావు గారి అకౌంట్లో పడిపోయింది.
అలాంటి టైములో మళ్ళీ రాఘవేంద్ర రావు గారే రాజమౌళికి తిరిగి ఛాన్స్ ఇచ్చారు. ఆయన కొడుకు సూర్య ప్రకాష్ ను హీరోగా పెట్టి రాజమౌళి ఓ సినిమా చేయాలి అని స్క్రిప్ట్ కూడా రెడీ అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైందట . సెట్స్ పైకి వెళ్ళడమే ఆలస్యం అనుకున్న టైములో ఆ సినిమా ఆగిపోయిందట. దానికి కారణం అనుకున్న దానికంటే బడ్జెట్ లెక్కలు పెరిగిపోవడమేనని తెలుస్తుంది.. దాంతో రాజమౌళి- సూర్య ప్రకాష్ ల మూవీ మధ్యలోనే ఆగిపోయిందట.
తర్వాత మోహన్ లాల్ తో ఓ మైథలాజికల్ మూవీని అనుకున్నాడట రాజమౌళి. అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అయితే ఎన్టీఆర్ తో 'సింహాద్రి' నిర్మాతలు ఓ దర్శకుడితో సినిమా మొదలుపెట్టారట..సగం షూటింగ్ అయ్యాక ఆ మూవీ ఆగిపోయిందని తెలుస్తుంది.. ఆ దర్శకుడి ప్లేస్ లో రాజమౌళికి అవకాశం దొరికిందట. అలా 'సింహాద్రి' సినిమా రూపొందింది. దాని రిజల్ట్ ఏంటి.. తర్వాత రాజమౌళి గ్రాఫ్ ఎలా పెరిగింది అనే విషయం మన అందరికీ తెలిసిందే..!