ఈటీవీలో సరికొత్త కామెడీ షో.. పేరేంటో తెలుసా?
ఇక జబర్దస్త్ కార్యక్రమాలతో పాటు సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమం కూడా ప్రతివారం ప్రేక్షకులను అలరిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది. ఇక డాన్స్ రియాలిటీ షో ఢీ కేవలం డాన్సులకు మాత్రమే కాదు కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అదే సమయంలో ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇన్ని కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తూ ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ఉంటే ఇప్పుడు ఈ టీవీ లో మరో సరికొత్త కామెడీ షో రాబోతుంది అని తెలుస్తోంది.
ఇక ఈ టీవీ లో సరికొత్త కామెడీ షో అనేసరికి ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరిలో కూడా భారీగానే అంచనాలు పెరిగిపోతున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి అనేది తెలుస్తుంది. ఇక మరికొన్ని రోజుల్లో ఈ షో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సరికొత్త కామెడీ షో పేరు జాతిరత్నాలు అని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఈ విషయాన్ని ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో రివీల్ చేశారు. జాతి రత్నాలు కార్యక్రమంలో కనబడే కమెడియన్స్ అందరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలోకి వచ్చారు. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకులను ముందుకు ఈ సరికొత్తగా షో రాబోతుంది అని రివీల్ చేశారు..