ఆది పినిశెట్టి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఆది పినిశెట్టి , తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఒక వి చిత్రం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు. ఆ సినిమా తర్వాత హీరో కొంత కాలం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ మళ్లీ తెలుగు సినిమాలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆది పినిశెట్టి సంపాదించుకున్నాడు, ఆది పినిశెట్టి , అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అలాగే ఆది పినిశెట్టి , రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కు అన్నయ్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు, ఇలా సినిమాల్లో కేవలం హీరో పాత్రలు మాత్రమే కాకుండా ఇతర పాత్రల్లో కూడా కనిపించి ఆది పినిశెట్టి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆది శెట్టి వివాహం కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది, నిక్కీ గల్రాని వివాహం ఆది పినిశెట్టి తో జరగనున్నట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి.
సునీల్ హీరోగా చేసిన కృష్ణాష్టమి మూవీ తో తెలుగు తెరకి నిక్కీ పరిచయమైంది, ఆ తర్వాత మలుపు , మరకతమణి సినిమా లలో నిక్కీ గల్రాని , ఆది పినిశెట్టి సరసన నటించింది. ఈ సినిమాల సమయం లోనే వీళ్ళ మధ్య పరిచయం ప్రేమగా మారిందని చెబుతారు, ఆది పినిశెట్టి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి నిక్కీ హాజరవుతూ ఉండటంతో ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రస్తుతం కోలీవుడ్ లో షికారు చేస్తున్నాయి. ఈ ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి వివాహానికి ఒప్పుకోవడంతో, త్వరలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నట్టుగా ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి, త్వరలోనే వీరి వివాహం విషయంలో స్పష్టత రానుంది.