అల్లు అర్జున్ కి ఘోర అవమానం.. ఇదేంటి..!!

P.Nishanth Kumar
జక్కన్న ఆర్ఆర్అర్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నాడు. మార్చి 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది దాంతో ఈ సినిమా ఎంత వీలైతే అంత ప్రేక్షకులందరికీ చేరవేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇక్కడే రాజమౌళి ఓ చిన్న పొరపాటు చేశాడు. తన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఓ వ్యక్తి గురించి మాట్లాడకపోవడం ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో చర్చనీయాంశం అవుతుంది. పుష్ప చిత్రంతో ప్రేక్షకులు భారీ స్థాయిలో ఆకట్టుకున్నాడు అల్లుఅర్జున్. సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఊహించని స్థాయిలో దేశవ్యాప్తంగా భారీ వసూళ్లను అందుకుంది.

ట్రేడ్ వర్గాలు ఊహించని స్థాయి లో ఈ సినిమా దేశవ్యాప్తంగా వసూళ్లను సాధించగా ఈ సినిమా గురించి దేశ మొత్తం మాట్లాడుకున్నప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన రాజమౌళి మాత్రం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఈ సినిమా పేరు ఎత్తకపోవడం కనీసం అల్లు అర్జున్ పేరు తీయకపోవడం అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం లోపల ఎంత అసూయ ఉన్నా కూడా బయటకు పుష్ప చిత్రాన్ని చాలా పొగిడేశారు. సుకుమార్ తో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటాము అంటూ ఆఫర్లు ఇచ్చారు.

అలాంటి సినిమా ను కనీసం గుర్తు చేసుకోకపోవడం రాజమౌళి చేసిన పొరపాటు గా కొంతమంది చెబుతున్నారు. ఇది ఆయనలోని అసూయ ను తెలియజేస్తుందని కూడా కొంతమంది చెబుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ మీడియా దీనిని బాగా హైలెట్ చేస్తుంది. తెలుగు మీడియా దీనిని పట్టించుకోక పోయినా కూడా బాలీవుడ్ మీడియా మాత్రం కథనాలను ప్రచురిస్తూ ఉంది. టాలీవుడ్ ఇండస్ట్రీ లో గల వ్యవహార శైలి ని హైలెట్ చేస్తూ మరొకసారి టాలీవుడ్ సినిమా పరిశ్రమను టార్గెట్ చేస్తుంది. మరి  ఈ చిత్రం విడుదల అయి ప్రేక్షకులను భారీ స్థాయి లో అలరిచి టాలీవుడ్ సినిమా పరిశ్రమ పరువును కాపాడుతుందో చూడాలి. కనీసం ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆయన రాజమౌళి పుష్ప సినిమాకు సంబంధించిన ప్రస్తావన తెస్తాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: