కాశ్మీర్ మేనియా లో ఆర్ ఆర్ అర్ ను ఎవరు పట్టించుకోవడం లేదా..!!

P.Nishanth Kumar
ప్రస్తుతం దేశమంతటా కూడా ఓకే సినిమా పేరు వినిపిస్తుంది. అదే కశ్మీర్ ఫైల్స్. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బాలీవుడ్ చిత్రం సంచలనాలు సృష్టించే దిశగా ముందుకు దూసుకు పోతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ సాగుతుది. వివాదాస్పద అంశాలు మంచి కంటెంట్ ఉన్న సినిమా కావడంతో దీనికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు అంచి ఆదరణ అందిస్తున్నారు. మొదటి షో తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది.

 భారీ వసూళ్లు కూడా సంపాదించుకునే విధంగా ముందుకు పోతుంది. సునాయాసంగా 300 కోట్ల వసూళ్లను సాధించే విధంగా దూసుకుపోతుంది. ఈ సినిమాని విమర్శించిన చాలామంది ఇప్పుడు దీనిపై ప్రశంసలు కురిపించడం విశేషం. సెన్సార్ బోర్డు దగ్గర చాలా ఇబ్బందులను మరెన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాజనాలు అందుకోవడం జరుగుతుంది. దీని వెనుక చిత్ర యూనిట్ యొక్క కష్టం ఎంతో ఉందని చెప్పవచ్చు. తొలిరోజు ఫ్లాప్ టాక్ రావడంతో ఈ సినిమా జనాల్లోకి మరింతగా దూసుకుపోయింది అని చెబుతున్నారు.

ఒక్కసారిగా ఈ సినిమాకు హైప్ క్రియేట్ అయ్యింది. ట్రేడ్ పండితుల ప్రకారం ఈ సినిమా 200 కోట్ల నుంచి త్వరలోనే 300 కోట్ల ను కూడా సాధిస్తుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమా వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ బాలీవుడ్ ప్రేక్షకులు పట్టించుకోవడం లేదనే చెప్పాలి. రాజమౌళి తన ప్రయత్నంగా ఈ సినిమాను ప్రేక్షకులందరికీ చెరవేస్తున్నాడు. ఓ కమర్షియల్ సినిమా ఏ విధంగా అయితే ప్రేక్షకులకు అలరిస్తుందో హీరోలు కూడా తమ వంతు కృషిగా ఈ కార్యక్రమాలకు హాజరవుతూ అందరిని ఆకర్షిస్తున్నారు. మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. మరొకవైపు కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాకు ఆర్ ఆర్ సినిమా పోటీ కాదు అనే వాదన తెరపైకి వస్తుంది. రెండు డిఫరెంట్ జోనర్ సినిమాలు కావడం అర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యే సమయానికి కశ్మీర్ ఫైల్స్ సినిమా హవా పూర్తి అవుతుందని కొంతమంది చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: