మ్యూజిక్ డైరెక్టర్ తిట్లు పడాల్సిందేనా!!

P.Nishanth Kumar
గతంలో ఎటువంటి టెక్నాలజీ లేదు కాబట్టి మన  సినిమాలోని టెక్నీషియన్స్ ఎలాంటి రేంజ్ లో కాపీ చేసినా కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఒకవేళ సదరు సీన్ లేదా సదరు పాటను కాపీ చేశారని తెలిసిన కూడా బహిరంగంగా ఎప్పుడూ కూడా వారిని విమర్శించే వారు కాదు. ఎందుకంటే అప్పట్లో సినిమాను చూసి ఆనందించడం వరకే ప్రేక్షక పాత్ర ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. రోజులు మారినట్లుగా ప్రేక్షకుల అభిరుచులు అభిప్రాయాలు మైండ్ సెట్ కూడా పూర్తిగా మారింది.

అలా ఇప్పుడు సినిమాను జడ్జి చేసి దానిని వేలెత్తి చూపించి కాపీ చేసిన వారిని విమర్శలు చేయడం కూడా జరుగుతుంది. ప్రేక్షకులకు ఎలా తీయాలో తెలియకపోయినా విమర్శించడం బాగా తెలుసు కాబట్టి ఏ సినిమా వచ్చినా కూడా తనలోని లోపాలను ఎత్తిచూపుతూ మంచి చెప్పకుండా సదరు టెక్నీషియన్స్ ని విమర్శిస్తున్నారు. ఆ విధంగా ఇటీవల కాలంలో  సినిమా పైన కాదు కానీ సంగీత దర్శకుల విషయంలో కొంతమంది విమర్శకులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. సినిమాలో పాటలలో ఏ ఒక్క అంశం ఇతర పాటల తో కలిసిన కూడా వారు ఏమాత్రం వదిలిపెట్టకుండా దారుణమైన విమర్శలను చేస్తున్నారు.

టాలీవుడ్ సంగీత ప్రపంచంలో చెరకో పేజీ నింపుకొని ఇప్పుడు భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు తమన్ మరియు దేవిశ్రీప్రసాద్. వీరిద్దరు కూడా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి సినిమా విడుదలైన సమయంలో తమ సంగీతం తో ఏ స్థాయి లో అలరిస్తున్నారో ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. కానీ కొంతమంది విమర్శకులు పనిగట్టుకుని మరి వీరిపై  పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వారు ఎలాంటి పాటను విడుదల చేసినా కూడా ఏదో ఒక పాటకు లింక్ పెడుతూ విమర్శించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ కొంతమంది విమర్శిస్తే తగ్గే వారు కాదు కొంతమంది. అలాంటి వారే ఈ ఇద్దరు సంగీత దర్శకులు. విమర్శల నుంచి నేర్చుకోవడం దాని నుంచి మరింత మంచి సంగీతాన్ని అందించడం మాత్రమే వీరికి తెలుసు. కాబట్టి వీరు ఈ విమర్శలను పట్టించుకోకుండా తమ పని తాను చేసుకుంటూ పోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: