రౌడీ హీరోతో స్పెషల్ సాంగ్ చేస్తున్న ప్రియా వారియర్?

VAMSI
విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న తాజా చిత్రం లైగర్. డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఛార్మి, అపూర్వ మెహతా, కరణ్ జోహార్ లు నిర్మాతలుగా బాధ్యతలు వహిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ యువతను తెగ ఊరిస్తోంది. బులెట్ లాంటి కొంటె చూపుతో ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన భామ ప్రియా ప్రకాష్ వారియర్ కు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఈ అందాల భామ ఇటీవలే నితిన్ చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగులో మరింత అభిమానాన్ని పోగుచేసుకుంది. అయితే ఇపుడు లైగర్ మూవీ లో ఓ స్పెషల్ సాంగ్ కు విజయ్ తో చిందులు వేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రం లో ప్రత్యేక పాట కోసం ప్రియ వారియర్ అయితే బాగుంటుందని, మంచి హైప్ వస్తుందని భావించి ఆమెను సంప్రదించారట. అయితే ప్రియ ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ఇంకా తన నిర్ణయం చెప్పలేదని తెలుస్తోంది. కానీ మంచి అవకాశం కావడంతో ఆమె ఎలా అయినా తన డేట్స్ ను అడ్జెస్ట్ చేసుకుని లైగర్ మూవీ లో స్పెషల్ సాంగ్ కు ఓకే చెప్పాలని యోచిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కిక్ బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. అందులోనూ పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తుండడంతో ఈ సినిమా పలు బాషల్లో క్రేజ్ బజ్ ను క్రియేట్ చేసింది.

కాబట్టి అమ్మడు ప్రియ వారియర్ నో అనకుండా త్వరలోనే తన కాల్ షీట్ తో సహా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అనుకుంటున్నారు. మరి ఏమౌతుందో చూడాలి. ఈ చిత్రం లో బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: