అక్కడ సాహో డే 1 రికార్డుని RRR క్రాస్ చేస్తుందా?

Purushottham Vinay
ఓపెనింగ్ డే ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధించబోయే వసూళ్లపై ఇప్పడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన `సాహో` సినిమా డే వన్ రికార్డ్స్ ని ఉత్తరాదిలో `ఆర్ ఆర్ ఆర్` సినిమా క్రాస్ చేస్తుందా? అన్నది ఇప్పడు హాట్ టాపిక్. `సాహో` సినిమాకి తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో మిక్స్డ్ టాక్ వినిపించింది.రివ్యూస్ కూడా ఆ స్థాయిలోనే వచ్చాయి. దీంతో దక్షిణాదిలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లని రాబట్టలేకపోయింది. కానీ దక్షిణాదిలో రివ్యూస్ ఇంకా టాక్ పరంగా మిశ్రమ స్పందన లభించినా కానీ ఉత్తరాదిలో మాత్రం ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. దీంతో అక్కడ `సాహో`సినిమా ఓపెనింగ్ డే రోజున 24 ప్లస్ కోట్లని రాబట్టి `బాహుబలి 2` సినిమా తరువాత స్థానంలో నిలిచింది. అయితే ఈ రికార్డుని `ఆర్ ఆర్ ఆర్` సినిమా క్రాస్ చేస్తుందా? అన్నది ఇప్పడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఇక మారిన సమీకరణాలు పరిస్థితులని బట్టి చూస్తే `సాహో` సినిమా రికార్డుని బ్రేక్ చేయడం అంత సులువైన పనేమీ కాదంటున్నారు. 



ట్రేడ్ పండితుల విశ్లేషణల ప్రకారం ఫస్ట్ డే `ట్రిపుల్ ఆర్` సినిమా 19 కోట్లు మాత్రమే వసూలు చేసే అవకాశం వుందట.అలాగే మరో మాట కూడా వినిపిస్తోంది. ఇంతకు తక్కువ కూడా వసూలు చేయోచ్చని అది కూడా 10 నుంచి 13 కోట్ల మేర ఓపెనింగ్ డే వసూళ్ల ని హిందీ బెల్ట్ లో రాబట్టే అవకాశాలు వున్నాయని చెబుతున్నారు.కారణం ఈమధ్యే విడుదలైన హిందీ చిత్రం `ది కశ్మీర్ ఫైల్స్`. మార్చి 11 వ తేదీ న దేశ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రదర్శింపబడుతూ వసూళ్ల పరంగా సంచలనం సృస్టిస్తూ బాలీవుడ్ కి అప్పటి మంచి రోజులని తెచ్చింది. వివాదాస్పద అంశం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా పై దేశం మొత్తం కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద `ఆర్ ఆర్ ఆర్`సినిమాకు గట్టి పోటీని ఇవ్వడం ఖాయం అని  చెబుతున్నారు.ఇక ఈ కారణంగానే `ఆర్ ఆర్ ఆర్` సినిమా ప్రారంభ వసూళ్లుపై ప్రభావం పడబోతోందని పాజిటివ్ రెస్పాన్స్ కనుక వస్తే కానీ వసూళ్ల పరంగా మార్పు వచ్చే ఛాన్సే లేదని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: