సినిమా విధి వ్రాత పై పూజ హెగ్డే వితండ వాదం !

Seetha Sailaja
ప్రస్తుతం పూజ హెగ్డే మ్యానియా వెలిగిపోతోంది. దక్షిణాది సినిమా రంగంలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడ పూజా హెగ్డేకు విపరీతంగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె పారితోషికం 3 కోట్ల స్థాయికి దాటిపోయినా ప్రముఖ దర్శక నిర్మాతలు అందరు ఆమెనే కోరుకుంటున్నారు. ఈమధ్య ముంబాయ్ కి చెందిన ఒక ప్రముఖ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘విధి’ గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.


తాను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను హీరోయిన్ గా పనికిరాను అని కొందరు కామెంట్స్ చేసినప్పుడు తన అదృష్టం అంతేకాబోలు అని సరిపెట్టుకున్న విషయాన్ని గుర్తుకు చేసుకుంది. అయితే తన ‘విధి’ వ్రాత బాగుండటంతో తాను ఇప్పుడు టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగినప్పటికీ తాను ఇప్పుడు విధిని పూర్తిగా నమ్ముతాను అంటూ కామెంట్స్ చేసింది.

ఏవ్యక్తికి అయినా జీవితంలో ఎదగడానికి కనీసం ఎంతోకొంత లక్ ఉండాలని అలా లక్ లేని వ్యక్తి ఎంత ప్రయత్నించినా విజయం సాధించలేడు అని తన వ్యక్తిగత అభిప్రాయం అని అంటోంది.


మనిషి జీవితాలను లక్ ప్రభావితం చేసినట్లుగానే నిర్మించిన ప్రతి సినిమాకు ఒక విధి ఉంటుందని విధి సరిగ్గా లేకపోతే ఎంత బాగా తీసినా ఆసినిమా హిట్ అవ్వదు అని తన అభిప్రాయం అంటోంది. ఒక సినిమా కలక్షన్స్ బాగా వచ్చిన సందర్భాలు ఉన్నాయని అదే బాగా కష్టపడి తీసిన సినిమా ఘోరంగా ఫెయిల్ అయిన సందర్భాలు తన కెరియర్ లో ఎన్నో చూసాను అని అంటోంది.


రేపు ఏమి జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి రేపటిని గురించి ఆలోచించి భయపదేకన్నా ఈరోజును పూర్తిగా సద్వినియోగం చేసుకోమని ఆమె చెపుతోంది. ఇక ప్రభాస్ తో మళ్ళీ తాను ఎప్పుడు నటిస్తానో తనకు తెలియదు అనీ అయితే ప్రభాస్ చాలామంచి వ్యక్తి అని చెపుతూ అలాంటి మంచి వ్యక్తులు ఇండస్ట్రీలో చాల అరుదుగా ఉంటారు అని అంటోంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: