'ఆ హీరోలతో మరో మల్టీస్టారర్ చేయాలని ఉంది': రాజమౌళి

Anilkumar
రాజమౌళి తాజాగా  చెక్కిన శిల్పం `ఆర్‌ఆర్‌ఆర్‌` . ఈ సినిమా ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించారు. ఇకపోతే ఈ మల్టీస్టారర్‌ చిత్రం సుమారు రూ. 480కోట్లతో రూపొందింది. అంతే కాదు భారీ స్థాయిలో ఈ నెల 25న ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పదివేల స్క్రీన్లలో విడుదల కాబోతుంది. అయితే  సినిమా ఆడియెన్స్ ని జనంలోకి తీసుకెళ్లేందుకు దేశ వ్యాప్తంగా ప్రచారాలు చేస్తున్నారు యూనిట్‌.ఇక ఇదిలా ఉంటే తాజాగా  రాజమౌళీ నుంచి మరో మల్టీస్టారర్‌ రాబోతుందనే వార్త ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. అయితే ఒకవేళ ఇదే నిజమైతే ఇండియాలోనే దీన్ని మించిన మల్టీస్టారర్‌ లేదని అంటున్నారు నెటిజన్లు.


అయితే ప్రస్తుతం రాజమౌళీ `ఆర్‌ఆర్‌ఆర్‌` ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ఈయన ఇప్పుడు క్షణం గ్యాప్‌ లేకుండా పర్‌ఫెక్ట్ గా ప్రమోషన్‌ ప్లాన్‌ చేశారు.తాజాగా  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో కలిసి ఇప్పటికే ఆయన దుబాయ్‌, కర్నాటక, ఢిల్లీ, జైపూర్‌, వారణాసి, కోల్‌కతా వంటి సీటీలను కవర్‌ చేశారు. అయితే బుధవారం వరకు ప్రమోషన్‌లో పాల్గొనబోతున్నారు. ఇకపోతే ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌కి చేరుకుని ఇక్కడ ఓ ప్రెస్‌ మీట్‌ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం అయితే ఈ ప్రమోషన్‌లో భాగంగా రాజమౌళి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయాన్ని వెల్లడించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో తమిళ హీరోలతో మల్టీస్టారర్‌ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారనే ప్రశ్న ఎదురైంది.


ఇక దీనిపై రాజమౌళి స్పందిస్తూ, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ లోక నాయకుడు కమల్‌ హాసన్‌లతో సినిమా చేయాలనుందని ఈయన  వెల్లడించారు. ఇకపోతే `కమల్ హాసన్ విలన్‌గా రజినీకాంత్‌ హీరోగా ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఒక ఐడియా ఉంది. అంతేకాదు రజనీకాంత్‌ విలన్‌గా, కమల్‌ హీరోగా చేసినా పర్వాలేదు.అయితే  ఇది చాలా సార్లు నా మైండ్‌లో మెదులుతుంటుంది. ఇక పూర్తి కథ లేదు కానీ అలా వారిద్దరిని చూడాలని ఓ అభిమానిగా వారితో అలాంటి సినిమా చేయ్యాలని ఉంది` అని రాజమౌళి తెలపడం జరిగింది. అయితే ఇదే నిజమై, పట్టాలెక్కితే ఆ సినిమా రేంజ్‌ని,ఇక  ఆ మానియా ఊహకందని విధంగా ఉంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: