ఇక సినిమాల విషయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరింత స్పీడు పెంచారు. రీమేక్ సినిమా `భీమ్లానాయక్` తక్కువ వసూళ్లు సాధించిన కాని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఈ సినిమా అందించిన సక్సెస్ ఆనందంలో మరిన్ని రీమేక్ లకు వపన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారు. తమిళంలో సముద్రఖని నటించి తెరకెక్కించిన `వినోదాయ సితం`సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో తన మేనల్లుడు టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా నటించబోతున్నారు. పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్రివిక్రమ్ ఇంకా జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతోంది. ప్రస్తుతం క్రిష్ డైరెక్ట్ చేస్తున్న ఫిక్షనల్ పీరియడిక్ సినిమా `హరి హర వీరమల్లు` చిత్రంలో నటిస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ సుజీత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. ఆర్ ఆర్ ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ భారీ సినిమాని నిర్మించబోతున్నారట.
గతంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో దానయ్య `కెమెరా మెన్ గంగతో రాంబాబు` సినిమాని నిర్మించారు. ఇది వీరిద్దరి కలయికలో రానున్న రెండవ సినిమా. ఇప్పటికే డైరెక్టర్ సుజీత్ కు నిర్మాత డీవివి దానయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఇంత వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదని సమాచారం తెలుస్తోంది. ఆయన ఓకే అంటేనే సుజీత్ తో సినిమా లేదంటే మరో డైరెక్టర్ ట్రాక్ రావడం ఖాయం అని వార్తలు కూడా బాగా వినిపిస్తున్నాయి. సుజీత్ వ్యవహారం చూసిన వాళ్లంతా కూడా పూజారి ప్రసాదం పెట్టినా దేవుడు వరం ఇవ్వడం లేదంటే ఇదే మరి అని అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారట. సుజీత్ `సాహో` సినిమాతో బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. కేవలం ఒక సినిమా అనుభవంతో రెబల్ స్టార్ లాంటి పాన్ ఇండియా హీరోతో రెండవ చిత్రాన్నే భారీ స్థాయిలో తెరకెక్కించి తన సత్తాని చాటుకుని ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించారు. ఇక పవన్ కళ్యాణ్ దృష్టిని అకర్షించలేడా అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. మరి చూడాలి పవర్ స్టార్ ఈ రెబల్ స్టార్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడో లేదో అనేది.