స్వామిరారా @ 9 యేళ్లు.. ఎన్ని కోట్ల లాభం అంటే..?

Divya
హ్యాపీ డేస్ సినిమా తర్వాత నిఖిల్ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఆ సినిమాలో ఏ సన్నివేసాలు కూడా నిఖిల్ ను ప్రత్యేకంగా చూపించ లేకపోయాయి. అలాంటి సమయంలో వచ్చిన చిత్రమే స్వామి రా రా.. ఈ సినిమాతో డైరెక్టర్ సుధీర్ వర్మ సరికొత్తగా పరిచయమయ్యారు. ఈ చిత్రం 2013 వ సంవత్సరంలో మార్చి 23న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి నటించినది. ఈ సినిమా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఈ సినిమా విడుదలై ఇప్పటికి తొమ్మిది సంవత్సరాలు పూర్తి కావస్తోంది. అయితే ఈ సినిమా తో హీరో నిఖిల్ క్రేజ్ కూడా పూర్తిగా మారిపోయింది. అయితే ఈ సినిమా ముగిసే సమయానికి ఎంతటి కలెక్షన్లను రాబట్టింది అనేది ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.

1). నైజాం-1.56 కోట్ల రూపాయలు.
2). సీడెడ్- రూ. 67 లక్షలు
3). ఉత్తరాంధ్ర- రూ.89 లక్షలు.
4). ఈస్ట్- రూ. 34 లక్షలు.
5). వెస్ట్- రూ.31 లక్షలు.
6). గుంటూరు-1.2 కోట్ల రూపాయలు.
7). కృష్ణ- రూ. 53 లక్షలు.
8). నెల్లూరు- రూ. 32 లక్షలు.
9). ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..5.64 కోట్ల రూపాయలను రాబట్టింది.
10). రెస్టాఫ్ ఇండియా+ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే..1.43 కోట్ల రూపాయలను రాబట్టింది.
11). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..7.07 కోట్ల రూపాయలను రాబట్టింది.

స్వామి రారా సినిమా థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. రూ.3.92 కోట్ల రూపాయలు జరగగా ఈ చిత్రం ముగిసే సమయానికి ఏకంగా రూ.7.07 కోట్ల రూపాయలను రాబట్టింది.. దీంతో బయ్యర్లకు ఏకంగా 3.15 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పవచ్చు. దీంతో మొదటి సారి హీరో నిఖిల్ సినిమాకి ఇంత కలెక్షన్లు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమాని నాలుగు కోట్ల లోపు బడ్జెట్ తోనే తెరకెక్కించడం జరిగింది. దీంతో మరిన్ని లాభాలను చేకూర్చింది ఈ చిత్రం. ఇక ఈ సినిమా తర్వాత హీరో నిఖిల్ చాలా మారిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: