'కేజిఎఫ్ టు' ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ప్రభాస్..!

Pulgam Srinivas
యశ్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ వన్ మూవీ ఎ రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే, పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ వన్ మూవీ ఇండియా వైడ్ గా ఎంతో మంది ప్రేక్షకుల మనసును గెలుచుకొని బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.వ ప్రస్తుతం కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే,  తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తుఫాన్ అనే సాంగ్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ సాంగ్ కు ఇండియా వైడ్ గా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  


ఇది ఇలా ఉంటే కే జి ఎఫ్ చాప్టర్ వన్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు,  యశ్ హీరోగా రూపొందిన ఈ మూవీ లో సంజయ్ దత్ కీలకమైన పాత్రను పోషించారు.  ఇది ఇలా ఉంటే ఏప్రిల్ 14 వ తేదీన కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమాను   విడుదల చేయబోతున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది,  ఈ నేపథ్యం లో కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించిన విషయం హాట్ టాపిక్ గా మారింది.  ఈ మూవీ  ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట,   ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.  ప్రభాస్ తదుపరి మూవీ అయిన 'సలార్' కి ప్రశాంత్ నీల్ దర్శకుడు అందువలన కే జి ఎఫ్ చాప్టర్ టు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ రావడం ఖాయమని వార్తలు వస్తున్నాయి,  ఇది ఇలా ఉంటే ప్రభాస్,  ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ షూటింగ్ ఇప్పటి వరకే చాలా భాగం పూర్తయిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: