షాక్: భీమ్లా నాయక్ చిత్రం అక్కడ లేనట్లేనా..?

Divya
పవన్ కళ్యాణ్, మరొక హీరో రానా ప్రధాన పాత్రలు కలిసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే.. పవన్ కెరీర్ లో భారీ వసూళ్లను కలెక్షన్ చేసిన సినిమాగా నిలిచింది. అత్తారింటికి దారేది చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ కు బాగా పేరు తెచ్చి పెట్టిన సినిమాగా నిలిచింది. దాదాపుగా ఈ చిత్రం 200 కోట్లు వసూలు చేసినట్లు గా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఇక పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలలో వరుస పరాజయాల తరువాత ఈ సినిమా పవన్ కళ్యాణ్ కు కాస్త ఊరట ఇచ్చిందని చెప్పవచ్చు.

ఈ చిత్రం గత నెల 25వ తేదీన విడుదలైనది.. దీంతో ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని పెద్ద ఎత్తున సన్నాహాలు చేశారు. పుష్ప సినిమా కూడా హిందీలో మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది. ఇక ఈ సినిమా పాట లోనే పవన్ కళ్యాణ్ సినిమా అని కూడా అక్కడ విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ రాజకీయ కారణంగా ఈ చిత్రాన్ని అనుకోకుండా ఏపీలో విడుదల చేయడం జరిగింది.

ఇక అంతే కాకుండా మళ్లీ కరోనా కేసులు పెరిగితే మొదటికే మోసం వస్తుందని ఈ చిత్రాన్ని విడుదల చేయడం జరిగింది చిత్ర బృందం. ఆ రకంగానే బాలీవుడ్లో ఈ సినిమాని విడుదల చేయలేకపోయారు చిత్రబృందం. అయితే ఆ తర్వాత అయినా విడుదల చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది కానీ ఇంతవరకు ఈ సినిమా గురించి ఏవిధంగా ఎక్కడ బాలీవుడ్లో విడుదలవుతుందని దాఖలాలు కనిపించలేదు. ఇక తాజాగా ఈ చిత్రం ఓ టి టి లో కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. దీన్నిబట్టి చూస్తే ఈ సినిమా బాలీవుడ్ లో విడుదల చేయలేదని తెలిసిపోతోంది. ఇక ఓటిటి లో కూడా హిందీ వెర్షన్ లో ఈ చిత్రం విడుదల కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: