పవన్
కళ్యాణ్ తో
సినిమా చేయడం దర్శకులకు ఎంతో మంచి విషయమే అయినా కొంతమంది దర్శకులకు మాత్రం అది కత్తిమీద సాములాంటిది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం చేస్తున్న పవన్
కళ్యాణ్ తో
సినిమా చేయడం అంత ఈజీ కాదు. ఆయన డేట్ లు కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వకపోవచ్చు. అదే సమయంలో ఇతర నటీనటుల డేట్స్ మిస్ కావచ్చు. ఈ విధంగా పవన్
కళ్యాణ్ తో సినిమా చేసే దర్శకులు ఇప్పుడు ఈ విధంగా కొంత ఇబ్బంది పడుతున్నారు అన్న వార్తలు టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వరుసగా రెండు రీమేక్ సినిమాలను విడుదల చేసి సూపర్ హిట్ లు సాధించి ప్రేక్షకులలో శభాష్ అనిపించుకున్న పవన్
కళ్యాణ్ ఇప్పుడు మరి కొన్ని సినిమాలను చేసే విధంగా ముందుకు పోతున్నాడు. రాజకీయాలలోకి వెళ్లి అక్కడ ప్రజలకు సేవ చేస్తున్న పవన్ వచ్చే ఎన్నికల నాటికి ఎన్ని వీలైతే అన్ని సినిమాలు చేయాలనీ భావిస్తున్నాడు. అలా రెండు సినిమాలను పూర్తి చేయగా ఇప్పుడు మరో మూడు సినిమాలను చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న పవన్
కళ్యాణ్ ఆ తర్వాత
హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగవద్గీత అలాగే
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే
సుజిత్ దర్శకత్వంలో కూడా ఆయన ఓ
సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
సాహో చిత్రం తర్వాత ఏ చిత్రాన్ని మొదలు పెట్టని
సుజిత్ ఇప్పుడు పవన్
కళ్యాణ్ కు ఓ కథ వినిపించగా దానికి
ఫిదా అయిపోయిన పవన్
కళ్యాణ్ ఈ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఎప్పుడు
సినిమా చేస్తాడో క్లారిటీ ఇవ్వలేదట.
నిర్మాత తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రెడీగా ఉన్న
సుజిత్ ఈ చిత్రాన్ని ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. దీని కంటే ముందు
హరీష్ శంకర్ మరియు
సురేందర్ రెడ్డి వంటి దర్శకులు గత రెండు సంవత్సరాలుగా పవన్
కళ్యాణ్ కోసం వేచి చూస్తూనే ఉన్నారు.