అక్షయ్ పై అందుకే అంత కోపం..!

NAGARJUNA NAKKA
బాలీవుడ్‌ ఫుల్‌ స్పీడ్‌గా సినిమాలు చేసే హీరోల్లో అక్షయ్‌ కుమార్‌ అందరికంటే ముందుంటాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసే అక్షయ్, మార్చి 18న 'బచ్చన్ పాండే' సినిమాతో బరిలో దిగాడు. తమిళ హిట్‌ 'జిగర్తాండ' రీమేక్‌గా వచ్చింది 'బచ్చన్‌ పాండే'. అయితే ఈ సినిమా విడుదల అయినప్పటి నుంచి అక్షయ్‌ కుమార్‌పై ఘోరంగా ట్రోలింగ్ జరుగుతోంది. 'బచ్చన్‌ పాండే' కంటే వారం రోజుల ముందుగా మార్చి 11న 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా విడుదలైంది. ఈ సినిమాలో దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి వాస్తవాల కంటే కల్పితాలు ఎక్కువ చూపించాడనీ... జనాల మధ్య చిచ్చు పెడుతున్నాడని కొంతమంది విమర్శిస్తున్నా, వసూళ్లు మాత్రం భారీగా వస్తున్నాయి. ఇక ఈ సినిమా ప్రభావం అక్షయ్‌ కుమార్ 'బచ్చన్ పాండే'పైనా పడింది.
అక్షయ్‌ కుమార్‌ హిందీలో సినిమాలు చేస్తున్నా, ముంబాయిలో ప్రాపర్టీస్‌ ఉన్నా భారతీయ పౌరసత్వం లేదు. ఈ హీరో ఇప్పటికీ కెనడా సిటిజన్‌షిప్‌నే కంటిన్యూ చేస్తున్నాడు. దీనిపై ఎప్పటినుంచో సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ నడుస్తోంది. ఇక రీసెంట్‌గా వచ్చిన 'బచ్చన్‌పాండే'లో అక్షయ్‌ టైటిల్ రోల్‌ ప్లే చేశాడు. అయితే హిందు సర్‌నేమ్‌ పెట్టుకుని నెగటివ్‌ క్యారెక్టర్‌ చేశాడని అక్షయ్‌పై గుర్రుగా ఉన్నారు నెటిజన్లు.
'ది కశ్మీర్‌ ఫైల్స్‌'లో కశ్మీరీ పండిట్స్‌ పడిన బాధలు చూపెట్టి వివేక్‌ అగ్నిహోత్రి థియేటర్లని కంటతడి పెట్టిస్తే, అక్షయ్‌ కుమార్‌ హిందువుని విలన్‌గా చూపించాడని కామెంట్‌ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. అంతేకాదు అక్షయ్‌కి దేశభక్తి లేదని, భారతీయ పౌరసత్వంలేని ఈ హీరో సినిమాలు చూడొద్దని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు అక్షయ్‌ సినిమాలని బాయ్‌కాట్‌ చేయాలని, హాష్‌ట్యాగ్‌లు రన్‌ చేస్తున్నారు.
అక్షయ్‌ కుమార్‌పై ట్రోలింగ్‌తో 'బచ్చన్‌ పాండే' వసూళ్లు భారీగా పడిపోయాయి అంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. అంతేకాదు చాలా మల్టీప్లెక్సుల్లో 'బచ్చన్‌ పాండే'కి స్క్రీన్స్ తగ్గించారని, 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'కి ఉన్న డిమాండ్‌తో ఈ సినిమాకి స్క్రీన్స్‌ పెంచారని చెప్తున్నారు. దీంతో 'బచ్చన్‌పాండే' డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోతున్నారట. అక్షయ్‌ కుమార్‌ పౌరసత్వం గురించి 'బచ్చన్‌ పాండే'తో మొదలైన చర్చలు మరింత పెరిగితే, అక్షయ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌పైనా ఆ ప్రభావం ఉంటుందని చెప్తున్నారు విశ్లేషకులు. అంతేకాదు 'బచ్చన్ పాండే' వసూళ్లు చూసి అక్షయ్‌తో సినిమాలు తీస్తోన్న నిర్మాతలు కూడా భయపడుతున్నారట. అక్షయ్ కెనడా పౌరసత్వంతో మా సినిమాలు కూడా ఎఫెక్ట్‌ అవుతాయేమో, బిజినెస్‌ పడిపోయి, వసూళ్లు తగ్గితే ఎలా అని టెన్షన్ పడుతున్నారట మేకర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: