రాజమౌళి దర్శకత్వంలో వచ్చే ఏ సినిమా అయిన అద్భుతమని చాలా మంది ప్రేక్షకులు చెబుతూ ఉంటారు. ఆయన సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ కూడా ఓకే అనడంలో ఎన్నో రీ టేక్ లు తీసుకుంటాడని చెప్పడం లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మన తెలుగు వారికి అంతర్జాతీయ స్థాయి టెక్నీషియన్ అంటే ఒక చక్కని ఉదాహరణ రాజమౌళినే. తన సినిమాలోని ప్రతి అణువును ప్రాణం పెట్టి పని చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు. చిన్న విషయంలో కూడా ఏ విధంగా కాంప్రమైజ్ అవకుండా రీసైకిల్ చేసి వందకు వంద శాతం బాగా వస్తే ఓకే అంటాడు.
అలాంటి రాజమౌళి దర్శకత్వంలో ఇప్పుడు ఆర్ఆర్ ఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కూడా ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక హీరోల ఇంట్రడక్షన్ విషయంలో రాజమౌళి ఆలోచించే విధానం వేరే స్థాయిలో ఉంటుంది. సినిమాలో అభిమానులు అలరిమ్పబడేది అక్కడే హీరోలు కూడా థ్రిల్ అయ్యేది ఇక్కడే. కాబట్టి ఈ సన్నివేశాన్ని ఎంతో గ్రాండ్ గా ఎంతో కొత్తగా ప్లాన్ చేస్తూ ఉండాడు. ఆ విధంగా ఓ సందర్భంలో రాజమౌళి మాట్లాడుతూ రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సన్నివేశం చిత్రీకరణ కోసం చాలా కష్టపడ్డాడు చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా కోసం కొన్ని భయంకరమైన షాట్స్ లో పాల్గొనడం కూడా వెల్లడించారు. ఇంకా మాట్లాడుతూ రామ్ చరణ్ వెనక వెయ్యి మంది వచ్చే షాట్ బాగా వచ్చింది అని కూడా చెప్పాడు. దాడి చేసేందుకు సిద్ధమైన వారిపై కోపాన్ని చూపిస్తూ రామ్ చరణ్ పరిగెత్తే ఆ సన్నివేశాన్ని చూపించడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని కూడా చెప్పాడు. ఈ సన్నివేశంలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు అని కూడా చెప్పారు. ఆ విధంగా సన్నివేశాన్ని ప్లాన్స్ చేసినట్లు చెప్పి ఆయన అభిమానులను అలరిస్తున్నాడు. దీన్ని విన్న తరువాత రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా ను ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నట్లు ఎదురుచుస్తున్నారు.