మెగా ఫ్యాన్స్ కి భారీ షాకిచ్చిన రాజమౌళి..?

Anilkumar
యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా  మరో 18 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా  రిలీజ్ కానుంది. ఇకపోతే ఈ సినిమాలో చరణ్, తారక్ ఆర్ఆర్ఆర్ తో బాక్సాఫీస్ వద్ద కళ్లు చెదిరే రికార్డులను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే  రిలీజ్ కు కొన్ని గంటల ముందు ఫ్యాన్స్ కు జక్కన్న భారీ షాకిచ్చారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో చరణ్ కు జోడీగా అలియా భట్, తారక్ కు జోడీగా ఒలీవియా మోరిస్ నటించారు.ఇక  తనకు ఒలీవియాకు మధ్య ఎక్కువ సన్నివేశాలు లేవని తారక్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

అంతేకాదు చరణ్, అలియా మధ్య రొమాంటిక్ సీన్స్ తో పాటు సాంగ్స్ కూడా ఉన్నాయని జక్కన్న ఆ సాంగ్స్ ను విడుదల చేయలేదని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి.అయితే చరణ్ అభిమానులు సైతం వైరల్ అయిన వార్తలు నిజమేనని నమ్మి సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెంచుకున్నారు. కాగా తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం జరిగిన ఈ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. ఇక ఈ విషయం స్వయంగా రాజమౌళి మాట్లాడుతూ వెల్లడించడం గమనార్హం. అయితే సినిమాలోని నాటునాటు పాటలో కూడా కథ ఉందని సినిమాలో ఏమి ఉన్నా చరణ్, తారక్ మధ్యే ఉంటాయని చెప్పుకొచ్చారు.

ఇక హీరో, విలన్, రొమాన్స్, బ్రొమాన్స్ అన్నీ కూడా వీళ్లిద్దరి మధ్యే ఉంటాయని రాజమౌళి అన్నారు. కాగా  కథ, కథనంతోనే జక్కన్న మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ తొలిరోజు కలెక్షన్లు అంచనాలకు మించి ఉండబోతున్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అంతేకాకుండా 150 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు ఉండే ఛాన్స్ ఉంది.ఇకపోతే రిలీజైన తర్వాత ఈ  మూవీ ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం బాహుబలి2 సినిమాతో క్రియేట్ అయిన రికార్డులన్నీ బ్రేక్ అవుతాయనడంలో సందేహం లేదు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: