స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా మారిన మిల్కీ బ్యూటీ..!
తమన్నా , బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన అల్లుడు శీను సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను ఫిదా చేసింది.
ఆ తర్వాత మిల్కీ బ్యూటీ తమన్నా మరోసారి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన స్పీడున్నోడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
అలాగే టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన జై లవకుశ మూవీ లో స్పెషల్ సాంగ్ లో కనిపించిన తమన్నా తన హాట్ హాట్ అందాలతో కుర్రకారును వేడెక్కించింది.
అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా పాన్ ఇండియా మూవీ అయిన కే జి ఎఫ్ చాప్టర్ వన్ లో కూడా స్పెషల్ సాంగ్ లో కనిపించి ప్రేక్షకులను మైమరపించింది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న గని సినిమాలో కూడా తమన్నా స్పెషల్ సాంగ్ లో నటించింది.
ఇలా హీరోయిన్ గా టాప్ పొజిషన్ ఉన్న సమయం నుండి ఇప్పటి వరకు తమన్నా ఎప్పటికప్పుడు స్పెషల్ సాంగ్ లతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది.