ఆర్ఆర్ఆర్.. టికెట్లను చించేసిన అభిమానులు.. ఏం జరిగిందంటే?
దీంతో దర్శక ధీరుడు జక్కన్న చెక్కిన త్రిబుల్ ఆర్ అనే సినిమాను చూసేందుకు ప్రేక్షకులందరూ థియేటర్లకు బారులు తీరుతున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ఇక మొదటి రోజు కుదరకపోతే ఆ తర్వాత రోజైనా సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే త్రిబుల్ ఆర్ సినిమా కు ఉన్న బజ్ నేపథ్యంలో సినిమా టికెట్లు దొరకడం చాలా కష్టం గా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఇక కొంత మంది అభిమానులు మాత్రం ఏకంగా సినిమా చూడటానికి టికెట్లు దొరికిన తర్వాత కూడా వాటిని చింపేశారు అన్న వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం లో వెలుగులోకి వచ్చిందట. కుప్పంలో చరణ్, తారక్ అభిమానుల మధ్య టికెట్ల విషయంలో చిన్న వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. త్రిబుల్ ఆర్ టికెట్లపై ఓ హీరో అభిమాన సంఘం నాయకుల పేర్లు ఉండడమే దీనికి కారణమట. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మరో హీరో అభిమానులు ఎంతో ఆశగా సినిమా చూడాలని త్రిబుల్ ఆర్ టికెట్‌ను కొనుగోలు చేసినప్పటికీ చివరికి కోపంతో వాటిని చింపేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే భారీ అంచనాల మధ్య విడుదలైన త్రిబుల్ ఆర్ సినిమా నేపథ్యంలో ఇక థియేటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు థియేటర్ల యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశాయి.