త్రిబుల్ ఆర్ ట్విట్టర్ రివ్యూ.. ఇంతకంటే ఇంకేం కావాలంటున్న ఫ్యాన్స్?

praveen
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఎన్నో సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ అద్భుతమైన కళా ఖండం ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ అయింది. జక్కన చెక్కిన అద్భుతమైన శిల్పం లాంటి త్రిబుల్ ఆర్ సినిమా ను చూసేందుకు ప్రస్తుతం ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లకు బారులు తీరుతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదాపడిన  ఈ చిత్రం ఈనెల 25వ తేదీన నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.




 ఇప్పటికే యూఎస్ఏలో ప్రీమియర్ షోలు పడ్డాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుంది అన్నది తెలుస్తుంది. దాదాపు పదివేల స్క్రీన్ లపై ఇక ఈ సినిమా విడుదలైంది. ఇప్పటి వరకూ ఇదే రికార్డు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఓవర్సీస్లో ఈ సినిమా విడుదలైన నేపథ్యంలో ఇక త్రిబుల్ ఆర్ సినిమా కథ కథనం ఎలా ఉంది రాజమౌళి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో అన్న విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అభిమానులు. ఇక వివరాలు ఏంటో ఇప్పుడు చూసుకుందాం.



 త్రిబుల్ ఆర్ సినిమా లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు తమ పాత్రలకు ప్రాణం పోశారని మునుపెన్నడూ లేని విధంగా నటనలో విశ్వరూపం చూపించారని  నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ అరెస్టయిన సీన్ అయితే ప్రతి ఒక్కరి మదిని తాకుతుంది అని అంటున్నారు. ఇక ఫస్టాఫ్ లో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది అని అంటున్నారు. త్రిబుల్ ఆర్ ఒక విజువల్ వండర్ అని.. ఒక ఎమోషనల్ క్లాసిక్, యాక్షన్ ఫీస్ట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదంతా చూసిన ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఇంతకంటే మాకు ఇంకేం కావాలి అని అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr

సంబంధిత వార్తలు: