త్రిబుల్ ఆర్ సినిమా చూస్తూ.. ప్రాణం వదిలిన అభిమాని?

praveen
సాధారణంగా పెద్ద హీరో సినిమా విడుదల అయింది అంటే చాలు. అభిమానులు థియేటర్లకు బారులు తీరుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక సినిమా విడుదలైన దాదాపు కొన్ని రోజుల వరకు ప్రేక్షకులందరికీ మరింతగా సినిమాను ఆస్వాదించేందుకు అటు సినిమా థియేటర్ల నిర్వాహకులు కూడా సౌండ్ ఎక్కువగా వదులుతూ ఉంటారు.  ఇక ఈ సౌండ్ ప్రేక్షకులందరికీ సరికొత్త అనుభూతిని ఇస్తూ ఉంటుంది. ఇక అంతా బాగానే ఉంది. కానీ ఇక ఇలా ఎక్కువ సౌండ్ వదలటం మాత్రం హార్ట్ పేషెంట్ కి మంచిది కాదు. అందుకేసినిమా విడుదలైన మొదటి వారం వరకు హార్ట్ పేషంట్స్ ఎక్కువ సౌండ్ వదిలే థియేటర్లకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు.



 కానీ కొంతమంది వైద్యుల సూచనలు నిర్లక్ష్యం చేస్తూ థియేటర్లకు వెళ్లి ఇక భారీ సౌండ్ కారణంగా గుండె పోటుకు గురి కావడం లాంటి ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా  జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్గా రిలీజయింది. దాదాపు పదివేల తెరలపై ఈ సినిమా రిలీజ్ అవడం గమనార్హం.


 ఇక ఈ సినిమాపై ఏ రేంజిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి మామూలుగా లేదు. అయితే ఇటీవలే ఆర్ ఆర్ ఆర్ సినిమా చూస్తున్న సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అనంతపురంలోని ఎస్ వి మాక్స్ థియేటర్ లో త్రిబుల్ ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని చనిపోయాడు. సినిమా చూస్తూ అభిమాన హీరోల వీడియోలను చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అని స్నేహితులు తెలిపారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rrr

సంబంధిత వార్తలు: