"ఆర్ ఆర్ ఆర్" గురించి తెలియని కొన్ని రహస్యాలివే?

VAMSI
తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు రాజమౌళిది మరో ప్రస్థానం అనే చెప్పాలి. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఆ చిత్రాన్ని స్పెషల్ చేయడంలో జక్కన్న తర్వాతే ఎవరైనా అన్నట్లుగా ఉంటుంది ఈయన డైరెక్షన్. ఎస్ ఎస్ రాజమౌళి నుండి సినిమా వస్తుంది అంటే ఆ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అందులోనూ మల్టీ స్టారర్ మూవీ అంటే మాటలా? అలాంటి ఊహకు అందని అంచనాలతో మెగా పవర్ స్టార్, నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన చిత్రం "రణం రౌద్రం రుధిరం". ఎట్టకేలకు నేడు మన ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

చెర్రీ, తారక్ లు తమ స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమా వెనుక వున్న కొన్ని రహస్యాలను ఇపుడు మనం తెలుసుకుందాం. ఈ సినిమాలో భారీగా యాక్షన్ సీన్స్ ఉన్న విషయం తెలిసిందే. కాగా వాటి చిత్రీకరణ కోసం ఏకంగా 100 ఎకరాలను లీజ్ కు తీసుకుని మరి సన్నివేశాలను చిత్రీకరించారట. ఈ సినిమాకు సంబందించిన ప్రొడక్షన్ వర్క్ కోసం అదే ల్యాండ్ లో ఒక టెంపరరీ బిల్డింగ్ ను కట్టి అక్కడే ఎడిటింగ్, విజువల్స్ వంటి పనులను చేశారట. అంతే కాదు తారక్, చెర్రీ, దర్శకుడు రాజమౌళి, ఆలియా భట్ కొరకు ఆ షూటింగ్ స్పాట్ లో లొకేషన్ కు గట్రా తిరగడానికి  విడివిడిగా లగ్జరీ మిని బస్ లను కూడా ఏర్పాటు చేశారట.

ఇలా ఈ సినిమా వెనక చాలా పెద్ద గ్రౌండ్ వర్క్ జరిగింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువ కాలం జరగడంతో అప్పుడప్పుడు వీరి ఫ్యామిలీస్ కూడా ఇక్కడే కొద్ది రోజులు ఉండటం అందరూ కలిసి సరదాగా టైం స్పెండ్ చేయడం వంటివి కూడా జరిగాయట. మరి దీని ఖర్చు కూడా నిర్మాత అకౌంట్ లోనే పడుంటుందిగా? ఎలా అయితేనేంమి సినిమా బృందం అంతా పడిన కష్టానికి ఈ రోజు ప్రేక్షకుల ముఖంలో అందాన్ని చూస్తున్నారు. అదే వీరికి వెయ్యి కోట్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: