RRR : ఫ్యాన్స్ గొడవలు.. థియేటర్లపై దాడులు!

Purushottham Vinay
RRR : rrr సినిమా విడుదల రోజు నాడు కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇరు హీరోల అభిమానులు గొడవలు పడ్డారు.విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్ లో పొద్దున స్పెషల్ షో వేయగా.. సినిమా మొదలైన గంటకే టెక్నికల్ లోపాల కారణాలతో షో ఆగిపోయింది. సినిమా ప్రదర్శనకు అంతరాయం కలగడంతో తారక్ ఇంకా చరణ్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు.మేనేజ్మెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ థియేటర్ లోని ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఫ్యాన్స్ దాడిలో థియేటర్ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఇక ఈ క్రమంలో కొంతమంది పై అద్దాలు పడి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.ఇదే థియేటర్లో ఫ్యాన్స్ స్క్రీన్ దగ్గరకు వెళ్లకుండా పోడియంపై మేకులు బిగించి ఇనుప కంచెను కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 



ఇక ఒంగోలులోని ఓ థియేటర్ వద్ద rrr హీరోల ఫ్యాన్స్ మధ్య టిక్కెట్ల వివాదం అనేది నెలకొంది.స్థానిక థియేటర్ లో టికెట్స్ విషయంలో ఇరు వర్గాల ఫ్యాన్స్ మధ్య కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ హీరో ఫ్యాన్స్ తమకే ఎక్కువ టిక్కెట్స్ ఇవ్వాలని పట్టుపట్టడంతో మరో హీరో ఫ్యాన్స్ గొడవకు దిగడం జరిగింది.హీరోల అభిమానులు బాహాబాహీకీ దిగడంతో థియేటర్లో తలుపుతో పాటు అద్దాలకు అమర్చిన హ్యాండిళ్లను ధ్వంసమైనట్లు సమాచారం తెలిసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల వారికి సర్దిచెప్పి ఆ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది.అలాగే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో మమతా థియేటర్ యాజమాన్యం ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య పెద్ద గొడవ జరిగింది. కావాలనే టార్గెట్ చేసి యాజమాన్యం టికెట్స్ ఇవ్వడం లేదని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆరోపించారు. ఇది పరస్పర దాడుల దాకా వెళ్ళింది. చివరకు పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సర్దుమణిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: