జూనియర్ అభిమానులకు అసహనాన్ని కలిగిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పబ్లిక్ టాక్ !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ చాల బాగుంది అని అంటున్నవారంతా ఆసినిమాలో అల్లూరి పాత్రలో నటించిన రామ్ చరణ్ గురించి మాట్లాడుతున్నారు కాని కొమరం భీమ్ పాత్రలో నటించిన జూనియర్ పై చాలామంది ప్రశంసలు కురిపించకపోవడం తారక్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. వాస్తవానికి ఈ కామెంట్స్ చేస్తున్నది చరణ్ వీరాభిమానులు కాదు.



‘ఆర్ ఆర్ ఆర్’ మొదటిరోజు సినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు ఆసినిమాను చూసి బయటకు వస్తూ మీడియా మైకులముందు మాట్లాడిన సగటు ప్రేక్షకుడి ప్రశంసలలో ముందు చరణ్ పేరు వస్తే ఆతరువాత మాత్రమే జూనియర్ పేరు వస్తోంది దీనితో ఈమూవీలో చరణ్ తారక్ ను డామినేట్ చేసాడా అన్న ఫీలింగ్ వస్తోంది. వాస్తవానికి ఈసినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఈవిషయానికి సంబంధించి గతంలోనే లీకులు ఇచ్చాడు.




ఈమూవీలో చరణ్ పాత్ర మొదటి నుంచి చివరి వరకు ట్రావెల్ అయితే జూనియర్ పాత్ర ఆ స్థాయిలో ఉండదని చెపుతూ వచ్చాడు. అయితే ఇది మల్టీ స్టారర్ మూవీ కాబట్టి తారక్ ప్రాధాన్యత తగ్గదని అతడి అభిమానులు ఆశిస్తూ వచ్చారు చివరకు వారి అనుమానాలే నిజం కావడంతో తారక్ అభిమానులు అంతా రాజమౌళి పై రగిలి పోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈసినిమాను ప్రమోట్ చేస్తూ రాజమౌళి పలుమార్లు తన సినిమాలో జూనియర్ చరణ్ లు కనిపించరనీ కేవలం వారి పాత్రలు మాత్రమే కనిపిస్తాయి అని చెప్పినప్పటికీ ఆవిషయాలను జూనియర్ అభిమానులు సీరియస్ గా తీసుకోలేదు.



దీనికితోడు ఈమూవీతో తమ అభిమాన హీరోకు పాన్ ఇండియా ఇమేజ్ ఏర్పడుతుంది అని తారక్ అభిమానులు ఆశిస్తే కొంతమంది బాలీవుడ్ విమర్శకులు ఈమూవీని తక్కువ చేస్తూ ‘ఆర్ ఆర్ ఆర్’ వీకెండ్ సినిమా మాత్రమే అంటూ కామెంట్స్ చేస్తూ ఉండటంతో ‘ఆర్ ఆర్ ఆర్’ ను నమ్ముకుని జూనియర్ 3 సంవత్సరాలకు పైగా విలువైన కాలాన్ని వృధా చేసుకున్నందుకు ఫలితం ఇదేనా అంటూ తారక్ అభిమానులు అసహనంతో రగిలిపోతున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: