ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. అదేంటంటే ఓకే సిరీస్ లో రెండు మూవీస్ చేయడం. అంటే ఒక సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించడం అన్నమాట. దీన్ని మన టాలీవుడ్ లో మొదలు పెట్టింది దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమాతోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియా ప్రభాస్ అయిపోయాడు. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ మరో రెండు సినిమాల సీక్వెల్స్ లో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
వాటిలో కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ విషయం అధికారికంగా కూడా రివీల్ అయింది. ఇక ఇప్పుడు కొత్తగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమాకి కూడా సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు ఓం రావుత్. రామాయణం ఆధారంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఆదిపురుష్ సీక్వెల్ కి సంబంధించిన ఐడియాను ఇప్పటికే దర్శకుడు ప్రభాస్ కి చెప్పాడట.
దీంతో ప్రభాస్ కూడా సీక్వెల్ పై పాజిటివ్ గా రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక రాదే శ్యాం సినిమా ప్రమోషన్స్ కారణంగా ప్రభాస్ తదుపరి సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడింది.చిన్న సర్జరీ కారణంగా విదేశాల్లో రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్.. మే నెల నుంచి సలార్ సినిమా షూటింగులో జాయిన్ కాబోతున్నాడు. ఈ ఏడాది చివరికల్లా ఈ షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా జూన్ మధ్య ఈ సినిమాని విడుదల చేస్తామని తాజా ఇంటర్వ్యూలో నిర్మాత విజయ్ కిరందుర్ చెప్పారు. అయితే సలార్ సీక్వెల్ గురించి మాత్రం ఆయన నోరు విప్పలేదు. మొత్తం మీద సలార్ తో పాటు ఆది పురుష్ సినిమాకు సైతం సీక్వెల్ రాబోతుందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది...!!