టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి వారి పాట సినిమా తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చినప్పటికీ అవి బాక్స్ ఆఫీసు దగ్గర అంతగా ప్రభావం చూపలేదు. కానీ టీవీలో మాత్రం సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికే ఈ సినిమాని టీవీలో తెగ ఎంజాయ్ చేస్తుంటారు ఆడియన్స్. ఇక వీరి కాంబో లో హ్యాట్రిక్ సినిమా రాబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత సినిమాల మాదిరిగా కాకుండా ఈసారి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సర్కారు వారి పాట షూటింగ్ చివరి దశకు వచ్చింది ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో మహేష్ బాబు సూపర్ స్టైల్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. వేసవి కానుకగా మే 12వ తేదీన ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నాడు మహేష్. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచర్స్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.
అయితే ఈ సినిమాలతో పాటు తాజాగా మహేష్ బాబు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి శ్రీను తో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడని లేటెస్ట్ ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే అఖండ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న బోయపాటి.. ఇప్పుడు తన తదుపరి సినిమా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో చేస్తున్నాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయాలని బోయపాటి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అటు మహేష్ బాబు కూడా ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి నిజంగా ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే ఫాన్స్ కి పండగే అని చెప్పాలి...!!