పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కు
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగి ఉన్న ఈ
హీరో అజ్ఞాతవాసి
మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ తన అభిమానుల కోరిక మేరకు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు, పవర్ స్టార్ పవన్, కళ్యాణ్ వేణు
శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకిల్ సబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ
సినిమా మంచి విజయాన్ని సాధించింది, ఈ
సినిమా తర్వాత పవన్
కళ్యాణ్ , సాగర్ కేచంద్ర దర్శకత్వంలో మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే లో తెరకెక్కిన భీమ్లా
నాయక్ మూవీ లో నటించాడు.
ఈ
మూవీ లో
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ తో పాటు
దగ్గుబాటి రానా కూడా హీరోగా నటించాడు, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుండి మంచి కలిగి ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఈ
సినిమా మలయాళ సూపర్ హిట్
మూవీ అయ్యప్పనున్ కొషియన్ సినిమాకు
రీమేక్ కావడం, అలాగే ఈ సినిమాలో పవన్
కళ్యాణ్ ,
దగ్గుబాటి రానా హీరోలుగా నటించడం ఇలా అనేక కారణాల వల్ల ఈ సినిమాపై మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అలా ఎన్నో అంచనాల నడుమ
ఫిబ్రవరి 25 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయిన భీమ్లా
నాయక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించిన ఈ
సినిమా ఈ నెల 24 వ తేదీ నుండి తెలుగు ప్రముఖ 'ఓ టి టి' ఆహా లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే భీమ్లా
నాయక్ మూవీ ఆహా 'ఓ టి టి' లో అతి తక్కువ కాలంలో 100 మిలియన్ మినిట్స్ వ్యూస్ ను సొంతం చేసుకున్నట్లు తాజాగా ఆహా నిర్వహణ బృందం అఫీషియల్ గా తెలియజేసింది, ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన భీమ్లా
నాయక్ సినిమా 'ఓ టి టి' లో కూడా ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది.