టాలీవుడ్ యంగ్ హీరో నాగ సౌర్య ఇప్పుడు ''కృష్ణ వ్రింద విహారి'' అంటూ వస్తున్నాడు.నాగ శౌర్య హోమ్ ప్రొడక్షన్ ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ''కృష్ణ వ్రింద విహారి'' సినిమా తెరకెక్కుతోంది. రొమాంటిక్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య ఒక బ్రాహ్మణ కుర్రాడిగా కనిపించనున్నాడు. నాగ సౌర్యకి జంటగా కుర్ర భామ షెర్లీ సెటియా హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పార్ట్ కూడా పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ఆ మధ్య రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ తాజాగా టీజర్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.'కృష్ణ వ్రింద విహారి' సినిమా టీజర్ ను మార్చి 28 వ తేదీన సోమవారం నాడు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని కూడా వదిలారు.
ఇందులో నాగ శౌర్య ఇంకా షిర్లీ సెటియా రొమాంటిక్ పోజ్ లో కనిపిస్తున్నారు. పోస్టర్ ని బట్టి చూస్తే ఈ సినిమాలో వీరిద్దరూ కూడా ఎంతో అద్భుతమైన కెమిస్ట్రీ ని పంచుకున్నట్లు కనిపిస్తోంది.అలనాటి స్టార్ నటి రాధిక శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇంకా అలాగే టాలీవుడ్ నటులు అయిన వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - బ్రహ్మజీ - సత్య తదితరులు ఇతర పాత్రలు పోషించారు. శంకర్ ప్రసాద్ మల్పూరి సమర్పణలో ఉషా మల్పూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే బుజ్జి ఈ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.యంగ్ అండ్ డైనమిక్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.ఇక ఇతర టీం విషయానికి వస్తే..సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా ఇంకా తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. అలాగే రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.ఇక 'కృష్ణ వ్రింద విహారి' సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ 22 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.