ఆ థియేటర్ లో 'ఆర్ ఆర్ ఆర్' ఫస్ట్ హాఫ్ మాత్రమే వేసి ఆపేశారు.. ఎందుకో తెలుసా..?

Anilkumar
తాజాగా బాహుబలి రికార్డులను కూడా ఆర్ఆర్ఆర్ మూవీ బ్రేక్ చేసింది.అయితే ఇండియన్ సినిమా చరిత్రలోనే ఏ సినిమాకు రాని ఫస్ట్ డే వసూళ్లు ఈ సినిమాకు వచ్చాయి.ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా సృష్టిస్తున్న రికార్డులు మామూలుగా లేవు. ఇక ఇదిలా ఉంచితే ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ రూ.257 కోట్లు కలెక్ట్ చేసింది.అయితే ఒక్క తెలంగాణ, ఏపీలోనూ వంద కోట్ల కలెక్షన్లు దాటాయట. ఇక మరోవైపు ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పర్‌ఫార్మెన్స్‌కు అందరూ మంత్రముగ్ధులు అవుతున్నారు. అయితే అసలు విషయంలోకి వెళ్తే యూఎస్‌లోని ఓ థియేటర్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా సెకండ్ హాఫ్‌ను ప్రదర్శించలేదు.
ఇకపోతే కేవలం ఫస్ట్ హాఫ్ మాత్రమే వేసి ఆపేశారు. ఇక దానికి కారణం.. సినిమా నిడివి ఎక్కువ ఉండటం.కాగా సాధారణంగా యూఎస్‌లో నడిచే హాలీవుడ్ సినిమాల నిడివి గంట నుంచి గంటన్నర మాత్రమే ఉంటుంది. సినిమా నిడివి ఆధారంగా వాళ్లు షోలను ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికి వచ్చేసరకి.. అది రివర్స్ అయింది. సినిమా నిడివి 3 గంటలు ఉండటంతో ఈ విషయం తెలియక.. ఫస్ట్ హాఫ్ అయిపోగానే సినిమా అయిపోయిందని ఆ థియేటర్ మేనేజ్‌మెంట్ భావించడ్డం జరిగింది. ఇక సెకండ్ హాఫ్ కూడా ఉందని.. కాగా దాన్ని కూడా స్క్రీనింగ్ చేయాలని మాకు ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ రాలేదు అని థియేటర్‌కు సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు థియేటర్ యాజమాన్యం చెప్పిందట.
అయితే దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారట.కాగా ఈ ఘటన యూఎస్‌లోని సినీమార్క్ థియేటర్‌లో చోటు చేసుకుందట. అయితే ఫిలిం క్రిటిక్ అనుపమా చోప్రా ఈ ఘటనపై ట్వీట్ చేసింది.ఈ విష్యంమై నెటిజన్లు కూడా అవాక్కవుతున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ మాత్రమే వేసి సెకండ్ హాఫ్ ఆపేయడం ఏంటి...ఇక అదేం థియేటర్ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.అయితే  ఫస్ట్ డే ఫస్ట్ షోకు వెళ్తే ఇలా జరిగిందేంటి అని అనుపమకు తెగ చిరాకేసిందట. ఇకపోతే చివరకు ఆ థియేటర్ యాజమాన్యం.. సెకండ్ హాఫ్ వేశారో లేదో మాత్రం తెలియదు...!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: