బాలీవుడ్ లో చరణ్ మేనియా మాములుగా లేదుగా!

Purushottham Vinay
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి టాలీవుడ్ లో మంచి మాస్ ఇమేజ్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న రోజుల్లో బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. 2013లో జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంకా మాజీ మిస్ వరల్డ్ అయిన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది.బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా జంజీర్ సినిమాని రిఫరెన్స్‏గా చేసుకుని జంజీర్ సినిమా తెరకెక్కించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో బాలీవుడ్ సినీ విశ్లేషకులు రామ్ చరణ్ ని బాగా విమర్శించారు. బాలీవుడ్ లెజెండ్ సినిమాను చెడగొట్టాడని అసలు అతను నిజాంగానే హీరోనా అని.. మొహంలో ఎక్స్‏ప్రెషన్స్ అసలు పలకలేదని..మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయితే హీరో ఐపోతాడా అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు క్రిటిక్స్ ఇంకా సినీ వర్గాలు చరణ్ ని చాలా తీవ్రంగా విమర్శించాయి. దీంతో ఆ తర్వాత రామ్ చరణ్.. హిందీలో ఏ సినిమా చేయలేదు. ఇప్పుడు దాదాపు 9 ఏళ్ల తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్లాడు.



ఇక ఇప్పుడు అయితే రామ్ చరణ్ నటనకు బాలీవుడ్ ఆడియన్స్ బాగా ఫిదా అయ్యారు. అప్పుడు ఎవరైతే ఆయన్ని విమర్శించారో… ఇప్పుడు వాళ్లే చరణ్ ని గొప్ప నటుడు అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ పై ఉన్న భావన పూర్తిగా మారిపోయింది.. జంజీర్ సినిమా అప్పటకి ఇప్పటికీ రామ్ చరణ్‏లో చాలా మార్పు వచ్చిందని..ఆర్ ఆర్ ఆర్ సినిమాలో చరణ్ నటన అద్భుతమంటూ తెగ పొగిడేస్తున్నారు. ఇక ఒకప్పుడు ఆయన్ని తిట్టినవాళ్లే ఇప్పుడు బాగా మెచ్చుకుంటున్నారు.. సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సామాన్య ప్రేక్షకులు అభిమానులు ఇక మనల్ని ఎప్పుడూ పొగిడేవాళ్ళే… కానీ విమర్శించిన వాళ్లే తిరిగి పొగిడినప్పుడే అసలైన విజయం సాధించినట్టు అని రామ్ చరణ్ నిరూపించాడు.పాన్ ఇండియా లెవల్లో చరణ్ ఇంకా తారక్ స్టార్డం ఏకంగా పెరిగిపోయిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: