అమెరికాలో RRR హిస్టారికల్ రికార్డ్!

Purushottham Vinay
ఆర్.ఆర్.ఆర్ రికార్డులకి అవధులు లేకుండా పోయాయి. ప్లేస్ ఏదైనా ఈ సినిమా అక్కడ సరికొత్త రికార్డులను నమోదు చేస్తుంది. ఇక అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ సినిమా 50 కోట్ల క్లబ్ (6.5 మిలియన్ డాలర్లు)లో అడుగుపెట్టేసింది. కేవలం ప్రీమియర్లు కలుపుకుని ఒక రోజులోనే ఆర్.ఆర్.ఆర్ ఈ రేర్ ఫీట్ సాధించడం చర్చనీయాంశమైంది.అమెరికాలో ఆర్.ఆర్.ఆర్ సినిమా గర్జిస్తోందని డే 1లో 11.45 ఏఎం వద్ద వసూళ్ల కౌంట్ అద్భుతంగా కొనసాగుతోందని ఇంతకుముందు చిత్రబృందం కూడా ప్రకటించింది. ఇక 4.5 మిలియన్ డాలర్లు అప్పటికి వసూలైంది.. అంటే సుమారుగా 34.5 కోట్లు ఆర్.ఆర్.ఆర్ సినిమా వసూలు చేసింది.టాలీవుడ్ స్టార్ హీరోస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ఇంకా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి తెరపై మొదటిసారిగా కనిపించడం ఇంకా అది అభిమానుల్లో పోటీకి తెర తీసిన సంగతి తెలిసిందే. ఇక దీని ప్రభావం కూడా వసూళ్లపై స్పష్ఠంగా కనిపిస్తోంది.



 డే1 బాక్సాఫీస్ వద్ద అద్భుత సందడితో స్టార్ట్ అయ్యింది. USలో ఈ సినిమా ప్రీమియర్ షోల నుండి $3 మిలియన్లు వసూలు చేసిందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఇంతకుముందే ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా కేవలం ప్రీమియర్ షోల నుండి చాలా ఈజీగా $3 మిలియన్ల క్లబ్ ను అధిగమించిన మొదటి భారతీయ సినిమా అయ్యిందని ప్రకటించారు. ఇంతలోనే ఈ సినిమా డే వన్ లో 11.45 నిమిషాలకు ఏకంగా 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేసిందని వెల్లడించడం అనేది నిజంగా టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద ఒక సంచలనం అని చెప్పాలి. ఇక సాయంత్రానికి ఈ ప్రభంజనం 6.5 మిలియన్ డాలర్లకు చేరుకుంది.రాఫ్తార్ క్రియేషన్స్ ఓవర్సీస్ మార్కెట్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమాని విడుదల చేసింది. ఇక చూడాలి మున్ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను నమోదు చేస్తుందో అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: