అరుదైన రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్...!!

murali krishna
రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో అటు రామ్‌చరణ్ఇటు ఎన్టీఆర్ అభిమానులు బాగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడట.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న విషయం తెలిసిందే.. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదట. అయితే ఈ హీరోలు రెండేళ్లకు లేదా మూడేళ్లకు ఓ సినిమా చేస్తువుంటారు.

ఈ క్రమంలో ఇటీవల కాలంలో తన తోటి హీరోలకు సొంతం కాని ఓ రికార్డును జూనియర్ ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకున్నాడట. 2015లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ సినిమా నుంచి ఇప్పటి రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ వరకు వరుసగా ఆరు హిట్లు కొట్టిన ఘనతను ఎన్టీఆర్ సాధించాడట. దీంతో ఎన్టీఆర్ కెరీర్‌లో తొలి డబుల్ హ్యాట్రిక్ హిట్ నమోదైందని తెలుస్తుంది.టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ, ఆర్.ఆర్.ఆర్ లాంటి వరుస హిట్లు ఎన్టీఆర్ సాధించాడట. వీటిలో ఏ సినిమా కూడా అభిమానులను అస్సలు నిరాశపరచలేదు. టెంపర్ సినిమా కంటే ముందు ఎన్టీఆర్ వరుస ఫ్లాప్‌లను చవిచూశాడని అందరికి తెలుసు. రామయ్య వస్తావయ్యా, రభస లాంటి డిజాస్టర్లను కూడా ఎదుర్కొన్నాడు.

ఎన్టీఆర్‌తో పోల్చి చూస్తే యువ స్టార్ హీరోల్లో మరెవ్వరూ కూడా వరుసగా ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా ఆరు హిట్లను సాధించలేకపోయారు. పవన్ కళ్యాణ్ చివరి ఆరు సినిమాలు.. గోపాల గోపాల, సర్ధార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాత వాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్. వీటిలో సర్ధార్ గబ్బర్ సింగ్, అజ్ఞాత వాసి సినిమాలు భారీ డిజాస్టర్లు. అయితే పవన్ తన కెరీర్ ప్రారంభంలో మాత్రం వరుస హిట్లను అందుకున్నాడట.

మహేష్‌బాబు విషయానికి వస్తే.. అతడి చివరి ఆరు సినిమాలు.. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, స్పైడర్, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు. వీటిలో బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి భారీ డిజాస్టర్లు ఉన్నాయి. ప్రభాస్ విషయానికి వస్తే.. అతడి చివరి ఆరు సినిమాలు.. రెబల్, మిర్చి, బాహుబలి, బహుబలి-2, సాహో, రాధేశ్యామ్. వీటిలో రెబల్, సాహో, రాధేశ్యామ్ సినిమాలు అభిమానులను అయితే తీవ్రంగా నిరాశపరిచాయి.

అల్లు అర్జున్‌ విషయానికి వస్తే అతడి చివరి ఆరు సినిమాలు.. సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, డీజే, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, అలవైకుంఠపురంలో, పుష్ప వంటి సినిమాలు ఉన్నాయి. వీటిలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి డిజాస్టర్ మూవీ కూడా ఉంది. అటు హీరో రామ్‌చరణ్‌ చివరి ఆరు సినిమాలలో గోవిందుడు అందరివాడేలే, బ్రూస్‌లీ, ధృవ, రంగస్థలం, వినయ విధేయ రామ, ఆర్.ఆర్.ఆర్ ఉండగా.. వీటిలో బ్రూస్‌లీ మరియు వినయ విధేయ రామ లాంటి డిజాస్టర్ మూవీలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: