బాహుబలి రికార్డులు సేఫేనట!!

P.Nishanth Kumar
దక్షిణాది సినిమాలకు దేశవ్యాప్తంగా ఎంతటి స్థాయి ప్రాధాన్యత ఉంటుందో ప్రస్తుతం దక్షిణాది సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ ను బట్టి తెలుస్తోంది. మేకర్స్ కూడా ఎంతో అద్భుతంగా  సినిమాలను తెరకెక్కిస్తున్న డంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కుతున్నాయి. గతంలో దక్షిణాది సినిమా అంటే ప్రేక్షకులతో పాటు మేకర్స్ కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎప్పుడైతే బాహుబలి సినిమా విడుదల అయిందో అప్పటి నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అని చెప్పవచ్చు.

దక్షిణాది సినిమాలకు కూడా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రేక్షకులు ఎదురు చూసేలా మన సినిమాలు వండర్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఉత్తరాదిలోనీ సినిమాలకు సాధ్యంకాని రికార్డులను సృష్టించడం అత్యధిక వసూళ్లను రాబట్టడం వంటివి ఇప్పుడు జరుగుతున్నాయి. ఉత్తరాది వారు కూడా మన తెలుగు సినిమాలపై కన్నేసి బాలీవుడ్లో ఆయన చిత్రాలను రీమేక్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఆ విధంగా ఒక్కరోజులోనే 100 కోట్లకు మించిన వసూళ్లను రాబడుతూ విజయాలను అందుకుంటున్న మన తెలుగు టాప్ సినిమాల గురించి ఇప్పుడు చూసుకుందాం. 

ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 వ భాగం ఉత్తరాదిన సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. బాలీవుడ్ లో మొదటిరోజు 40 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ స్థాయి లో విజయం సాధించిన తొలి భారతీయ సినిమా ఇదే అని చెప్పాలి. వసూళ్ళ పరంగా ఇది టాప్ పొజిషన్ లో ఉంది. ఇక ఆ తర్వాత స్థానంలో  తాజాగా ఆర్ ఆర్ ఆర్ సినిమా రికార్డులకెక్కింది. ఆర్ ఆర్ ఆర్ హిందీ వెర్షన్ కేవలం 25 కోట్ల రూపాయలను సాధించింది. సాహో 24 కోట్లు రజినీకాంత్ రోబో సినిమాకు 19 కోట్లు బాహుబలి మొదటి భాగానికి ఐదున్నర కోట్లు వచ్చాయి. ఇక పోతే రజనీకాంత్ కబాలి సినిమా, చరణ్ జంజీర్ మూడున్నర కోట్లు మూడు కోట్ల రూపాయలను సంపాదించుకుంది.  అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాకి మూడు కోట్ల ముప్పై లక్షలు వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: