RRR : ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సరికొత్త రికార్డ్!

Purushottham Vinay
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇంతవరకూ విడుదలైన సినిమాలలో వసూళ్ల పరంగా టాప్ 10 సినిమాలేవనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది. అలా చూసుకుంటుంటే తాజాగా విడుదలైన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఫస్ట్ ప్లేస్ ను ఆక్రమించింది.మొదటి రోజున ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ థియేటర్స్ నుంచి 78 లక్షల గ్రాస్ ను వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇంకా చరణ్ నటించిన ఈ సినిమా సాధించిన రికార్డుల లిస్ట్ లో ఇది కూడా ఒకటిగా కనిపిస్తోంది. 2వ స్థానంలో 'పుష్ప' సినిమా వుంది. ఈ సినిమా ఇక్కడ 41.31 లక్షల గ్రాస్ ను రాబట్టింది.ఇక 3వ స్థానాన్ని 'భీమ్లా నాయక్' సినిమా ఆక్రమించింది. ఈ సినిమా  38.06 లక్షలను వసూలు చేసింది.




ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా 'సరిలేరు నీకెవ్వరూ' 37.28 లక్షల గ్రాస్ తో 4వ స్థానంలో  నిలవగా 36 లక్షల గ్రాస్ తో 'బాహుబలి' 5వ స్థానంలో ఇంకా 35.08 లక్షల గ్రాస్ తో 'రాధేశ్యామ్' 6వ స్థానంలో ఉన్నాయి. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' 34.40 లక్షల గ్రాస్ తో 7వ స్థానంలో నిలిచింది. ప్రతికూల పరిస్థితుల్లో విడుదలైన ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను దక్కించుకోవడం నిజంగా పెద్ద విశేషంగానే చెప్పుకోవాలి. అలాగే 34.29 లక్షల గ్రాస్ తో 8వ స్థానంలో 'సాహో' సినిమా 29.98 లక్షల గ్రాస్ తో 9వ స్థానంలో 'మహర్షి' సినిమా కనిపిస్తుంది.ఇక 28.96 లక్షల గ్రాస్ తో 'అజ్ఞాతవాసి' సినిమా 10వ స్థానంలో నిలిచింది. మొదటి రోజు వసూళ్ల విషయంలో ఈ సినిమాలు టాప్ టెన్ లిస్టులో నిలిచాయి. 'ఆర్టీసీ క్రాస్ రోడ్స్' నుంచి ఈ రికార్డులను దక్కించుకున్న జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు 3 పవర్ స్టార్ పవన్ సినిమాలు 3 ఉండగా సూపర్ స్టార్ మహేశ్ సినిమాలు రెండు ఉండటం గమనించదగిన విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: