శ్రీ రెడ్డి నాటు కోడి వంట మాములుగా లేదుగా...!!

murali krishna
కాస్టింగ్ కౌచ్‌తో పాపులారిటీని సొంత చేసుకున్న బోల్డ్ నటి శ్రీ రెడ్డి. వివిధ వివాదాల అనంతరం కొంత గ్యాప్‌ తీసుకొని ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించి విభిన్న వీడియోలు చేస్తూ ఇప్పుడు ఆమె మళ్లీ వార్తల్లో నిలుస్తోంది.

ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్‌కి బాధితులైన ఆడవాళ్లకు న్యాయం చేయాలని ఎంతో రచ్చ చేసిన ఈ బోల్డ్ భామ , మెగా ఫ్యామిలీని అనరాని మాటలు అని ఎంతో వైరల్‌గా మారింది. ఆ తర్వాత మళ్లీ ఇటీవలే నేను తప్పు చేశాను, క్షమించండి అంటూ శ్రీరెడ్డి చేసిన పోస్ట్ అయితే సంచలనంగా మారింది.

ఇక ఈ మధ్య కాలంలో తన వీడియోలతో శ్రీరెడ్డి ప్రేక్షకులను కూడా బాగా మచ్చిక చేసుకుంంటుందనే వార్తలు రాకపోలేదు. ఒకప్పటి ఆమె వ్యక్తిత్వానికి, ఇప్పుడు ఆమె నడుచుకుంటున్న విధానానికి అంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అలా చేసింది ఈమేనా అని నిర్ఘాంతపోయి మరి చూస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ కోసం ఆమె చేసిన ప్రయత్నానికి కొందరు ప్రశంసించగా చాలా మంది మాత్రం ఆమెను బాగా విమర్శించారు. దానికి తోడు అప్పట్లో ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పైనా వ్యాఖ్యలు చేయడంతో అవి దుమారంగా మారి ఎంతో సంచలనం సృష్టించాయి.

అయితే ఆమె తాజాగా తన యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు బాగా ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సులతో షో చేసే శ్రీరెడ్డి, ఈ వీడియోలో చీరకట్టులో కనిపిస్తూ , పంట పొలాల మధ్య తిరుగుతూ బాగా వంటలు చేస్తుంది. అప్పట్లో ఓ వీడియోలో చేపల కూర చేసిన ఈమె, ఈ సారి నాటు కోడి కూర అంటూ అలరించింది. అంతే కాదు పిల్లల మధ్య కూర్చొని, తాను చేసిన వంటను ఆస్వాదించింది కూడా . ఈ వీడియోను చూసిన వీక్షకులు పలు రకాలుగా స్పందిస్తున్నారట . అంతే కాకుండా ఆమె తన పంట, పొలాలను చూపిస్తూ, అందులో భాగంగా తాను కొనుగోలు చేసిన స్థలాన్ని కూడా చూపిస్తుంది. అంతా బాగుంటే ఈ పల్లె వాతావరణంలో ఇల్లు కట్టుకోవాలని ఉందని చెప్తూ అందర్నీ కూడా ఆకట్టుకుంటుంది. అంతటితో ఆగకుండా అక్కడ తన పొలంలో వరినాట్లు వేస్తూ, అక్కడ పని చేస్తున్న కూలీలతో ముచ్చటించడం ఎంతో సరదాగా అనిపిస్తుంది. ఇలా శ్రీరెడ్డిలో వచ్చిన మార్పును చూసి కొంత మంది అయితే ఆశ్చర్యపోతున్నారు. ఇదంతా నిజమేనా అంటూ పలు కామెంట్స్ కూడా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: