బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా అంటే అవుననే విషయం తెలుస్తుంది. తాజాగా లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ.. చాలా కాలంగా కూడా అసలు నా పిల్లలకు ఏం కావాలో నాకు తెలియదు. వారికి ఏం కావాలి ఇంకా నా నుండి వారు ఏం ఆశిస్తున్నారు అనే విషయం తెలుసుకునేప్పటికి చాలా ఆలస్యం అయ్యింది. దాంతో నా పై నాకే చాలా కోపం వచ్చింది... నాకు పిల్లలను దూరం చేసిన సినిమాలపై బాగా కోపం వచ్చింది. నాకు నా కుటుంబానికి గ్యాప్ పెంచింది ఈ సినిమాలే కనుక ఆ సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నాను.నేను ఈ సినిమాలకు గుడ్ బై చెప్పాలని చాలా నెలల క్రితమే నిర్ణయం తీసుకున్నాను. కాని ఆ టైంలో ప్రకటిస్తే లాల్ సింగ్ చద్దా సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా అలా చెప్పానేమో అని అంతా కూడా భావిస్తారు. అందుకే నేను ఆ సమయంలో ఇలా చెప్పలేదు.అని అమీర్ ఖాన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు మాత్రం ఎందుకు ఈయన ఆ విషయాన్ని చెబుతున్నాడు అనేది అసలు ఏ ఒక్కరికి కూడా అర్థం కావడం లేదు.
లాల్ సింగ్ చద్దా సినిమా ఇంకా విడుదల కాకుండానే ఎందుకు తన సినిమాల రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటించారు అనేది తెలియాల్సి ఉంది. హీరోగా నటించడం మాత్రమే కాకుండా నిర్మాణంకు ఇంకా అలాగే డైరెక్షన్ కు కూడా గుడ్ బై చెప్పబోతున్నట్లుగా ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. అమీర్ ఖాన్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.తన ఒక్కో సినిమాకు ఏకంగా మూడు నుంచి నాలుగు సంవత్సరాల గ్యాప్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక సినిమా విడుదల అయిన తర్వాత ప్రకటిస్తే ఆ ప్రభావం ఎవరి పై ఉండదు అని తనకు తాను భావిస్తున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. తన నిర్ణయాన్ని పిల్లలకు ఇంకా అలాగే మాజీ భార్య కిరణ్ రావుకు చెప్పిన సమయంలో వారు ఏమాత్రం అంగీకరించలేదు. నేను ఎదో తప్పు చేస్తున్నట్లుగా వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. కిరణ్ రావు నా నిర్ణయం చెప్పిన సమయంలో కన్నీళ్లు పెట్టుకుంది అంటూ అమీర్ ఖాన్ కామెంట్స్ చేశాడు.